హైదరాబాద్ పాతబస్తీలోని చాదర్‌ఘాట్ మూసీ పరివాహక ప్రాంతం మూసానగర్‌లో అర్ధరాత్రి హైవోల్టేజ్ కరెంట్ ఇళ్లలోకి సరఫరా అయింది. ఇళ్లలోని గృహోపకరణాలు ఒక్కసారిగా కాలి బూడిదయ్యాయి. సుమారు 60 ఇళ్లల్లో టీవీలు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, ఫ్రిడ్జ్‌లు కాలి బూడిదయ్యాయి. మూసానగర్ వాసులు అందరూ చాదర్‌ఘాట్ విద్యుత్ కార్యాలయానికి చేరుకుని... కాలిపోయిన గృహోపకరణాలతో ధర్నాకి దిగారు. సంబంధిత అధికారులు వచ్చి నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...