ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కనుమదారిలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. బుధవారం ఉదయం వేళ ఒంపుల దారుల్లో దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి. కొండల మధ్య పాల సముద్రంలా మేఘాలు తేలియాడాయి.
చేతికందేలా కనిపించిన పొగమంచు సుందర దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ దృశ్యాలను స్థానికులు కెమెరాలో బంధించి.. సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం