ETV Bharat / state

Nizamabad MP Arvind : మండల అధ్యక్షులను మార్చడంపై.. ఎంపీ అర్వింద్​కు వ్యతిరేక నినాదాలు

MP Arvind
MP Arvind
author img

By

Published : Jul 26, 2023, 2:34 PM IST

Updated : Jul 26, 2023, 3:58 PM IST

14:28 July 26

Nizamabad MP Arvind : ఎంపీ ధర్మపురి అర్వింద్​కు వ్యతిరేకంగా నినాదాలు

మండల అధ్యక్షులను మార్చడంపై.. ఎంపీ అర్వింద్​కు వ్యతిరేక నినాదాలు

BJP Change Mandal Presidents In Telangana : హైదరాబాద్​లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉద్రిక్తతల పరిస్థితి నెలకొంది. నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంపీ అర్వింద్​ తీరును నిరసిస్తూ.. నిజామాబాద్​ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పార్టీ కార్యాలయంలో బైఠాయించి కార్యకర్తలు నిరసనలు తెలిపారు. ఆర్మూర్​, బాల్కొండ, బోధన్​ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు.

ఎంపీ అర్వింద్​నే ఏకపక్షంగా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపించారు. సొంత పార్టీ కార్యకర్తలకు అర్వింద్​ అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే మార్చిన మండల అధ్యక్షులను తిరిగి నియమించాలని డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి తమకు న్యాయం చేయాలని కార్యకర్తలు డిమాండ్​ చేశారు.

"బోధన్​ నియోజకవర్గంలో నలుగురు బలమైన మండల అధ్యక్షులను మార్చేసి వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. ఈ నలుగురు దశాబ్దాలుగా పార్టీ జెండా మోసి.. పార్టీకి ఎనలేని సేవలు చేశారు. జిల్లా ఇంఛార్జి వ్యతిరేకించిన, ఉన్నత స్థాయి నేతలు ఎవరికీ సమాచారం లేకుండా ఎంపీ అర్వింద్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నిర్ణయాన్ని రాష్ట్ర అధ్యక్షులు కిషన్​రెడ్డికి విజ్ఞప్తి చేయడం కోసం నిజామాబాద్​ ఉన్న ముఖ్యమైన నేతలు, కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. వెంటనే మండల అధ్యక్షుల మార్పిడిని విరమించుకోవాలి." - నిజామాబాద్​ బీజేపీ నేతలు

ఇవీ చదవండి :

Last Updated : Jul 26, 2023, 3:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.