ETV Bharat / state

ఉప్పల్​కు కొత్తందం.. సిద్ధమైన స్కైవాక్​

Skywalk at Uppal available soon: హైదరాబాద్ మహానగరంలో పాదచారుల భద్రత కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. అతిపెద్ద చౌరస్తాల్లో ఒకటైన ఉప్పల్ సర్కిల్‌లో హెచ్​ఎండీఏ స్కైవాక్‌ను నిర్మిస్తోంది. పాదచారులకు భద్రత కల్పిస్తూ అంతర్జాతీయ హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ ఆకాశమార్గం పనులు.. తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ స్కైవాక్ అందుబాటులోకి రానుంది.

Skywalk to be started at Uppal Circle
ఉప్పల్ సర్కిల్‌లో ప్రారంభంకానున్న స్కైవాక్​
author img

By

Published : Mar 4, 2023, 8:14 AM IST

ఉప్పల్ సర్కిల్‌లో ప్రారంభంకానున్న స్కైవాక్​

Skywalk at Uppal available soon: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, బ్రిడ్జ్‌లు అందుబాటులోకి రావడంతో ప్రధాన ఏరియాల్లో ట్రాఫిక్ కొంత మేర తగ్గింది. మరోవైపు కాలిబాటన నడిచేవారికి కూడా సర్కార్ అధిక ప్రధాన్యతను ఇస్తోంది. ప్రతి ఏడాది జంట నగరాల్లో వందల సంఖ్యలో కాలిబాటన వెళ్లే వారు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి పునరావృతం కాకుండా ఇప్పటికే ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వాటితో పాటు ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటే వారి కోసం ప్రత్యేకమైన స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వాహనాలు తిరగటం.. చౌరస్తా పెద్దగా ఉండడంతో రోడ్డు దాటాలంటే పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే నిర్మిస్తున్న స్కైవాక్ పనులు పస్తుతం 85శాతం పూర్తయ్యాయి.

స్కైవాక్​ నిర్మాణానికి ఎంత కేటాయించారు?: ఉప్పల్ జంక్షన్‌లో వాహనాలతో పాటు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ స్కైవాక్ నిర్మాణానికి హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ శ్రీకారం చుట్టింది. 640 మీటర్ల, వెడల్పు 3-4 మీటర్లు మేర ఏర్పాటు చేస్తున్న ఉప్పల్ స్కైవాక్‌కు రూ.25కోట్లు కేటాయించారు. కరోనా కారణంగా కాస్త ఆలస్యం అయినా.. కొంతకాలంగా పనులు చురుకుగా సాగుతున్నాయి. ఉప్పల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్ రహదారులకు ఈ వంతెనను అనుసంధానించారు.

ప్రయోజనం ఏమిటి?: నాలుగు వైపుల నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకునేలా మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. స్కైవాక్ మీదుగా అటు ఇటు రాకపోకలు సాగించవచ్చు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, మహిళలు, పిల్లలు, గర్భిణులకు.. ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం కల్పించారు. ఈ వంతెనతో రోడ్డుపై ప్రయాణికుల రద్దీ తగ్గి వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి.

ఎప్పటికి అందుబాటులోకి రానుంది: స్కైవాక్ ఏప్రిల్​లో అందుబాటులోకి రానుంది. ఇటీవల ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్ కుమార్ ఉప్పల్ పనులను పరిశీలించారు. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆకాశమార్గం అందుబాటులోకి వస్తే.. దీని ఫలితాల ఆధారంగా నగరంలో మరికొన్ని చౌరస్తాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.