ETV Bharat / state

'పది' పరీక్షలు.. ప్రతి కేంద్రంలో సిట్టింగ్ స్వ్కాడ్.. ఆ ఇన్విజిలేటర్ల తొలగింపు - Formation of sitting squads to prevent leaks

Sitting Squad for each hall in Telangana SSC exams: పదో తరగతి పరీక్ష జరుగుతున్న సమయంలోనే వరుసగా రెండు పేపర్లు బయటకు రావడంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత పెంచింది. మరోవైపు ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సిట్టింగ్‌ స్క్వాడ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నేర చరిత్ర ఉన్న ఇన్విజిలేటర్లను తొలగించారు. పరీక్షా కేంద్రంలో పోలీసులు సహా ఎవరూ సెల్‌ ఫోన్లు వినియోగించకుండా నిషేధించారు.

SSC
SSC
author img

By

Published : Apr 6, 2023, 7:24 AM IST

Updated : Apr 6, 2023, 7:33 AM IST

"పది"లంగా జరిగేందుకు పరీక్ష కేంద్రానికో సిట్టింగ్​ స్క్వాడ్​ ఏర్పాటు

Sitting Squad for each hall in Telangana SSC exams: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు జరుగుతున్న ప్రతి పరీక్ష కేంద్రంలో సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమిస్తున్నారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. వరుసగా రెండు పరీక్షల ప్రశ్నపత్రాలు.. పరీక్ష ముగియకముందే వాట్సాప్‌ ద్వారా బయటకు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం.. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ సిబ్బందిని కూడా పర్యవేక్షణకు వినియోగించాలని నిర్ణయించింది.

ఈ క్రమంలో ఇవాళ్టి ఆంగ్లం పరీక్షతోపాటు మిగిలిన పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసి పర్యవేక్షణ పెంచాలని కలెక్టర్లు, ఎస్పీలు తమ పరిధిలోని రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వ్యక్తిగత నేపథ్యం సరిగా లేని, క్రిమినల్‌ కేసులున్న ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈవో లను ఆదేశించారు. తాండూరులో కేసు నమోదైన ఉపాధ్యాయుడు బందెప్పను పరీక్షల విధుల్లోకి తీసుకోవడం వల్ల విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించారు.

రాష్ట్రవ్యాప్తంగా 2,652 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 4.94 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. పరీక్షల విధుల్లో 34,500 మంది ఇన్విజిలేటర్లు పాల్గొంటున్నారు. కాపీయింగ్‌ నిరోధానికి ఇప్పటివరకు ఫ్లయింగ్‌ స్క్వాడ్లు మాత్రమే ఉండేవారు. సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించిన 318 పరీక్షా కేంద్రాల్లోనే సిట్టింగ్‌ స్క్వాడ్లను నియమించారు.

తాజా రాష్ట్రంలో పరీక్ష పేపర్ల లీకేజీల నేపథ్యంలో మిగిలిన 2,334 కేంద్రాల్లోనూ సిట్టింగ్‌ స్క్వాడ్లు ఉండనున్నారు. ఇందుకోసం అధికారులైన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు,ఎమ్​పీడీవోలు, పోలీసు అధికారులను వినియోగించుకుంటున్నారు. ప్రతి కేంద్రంలో ఇద్దరు అధికారులు.. సిట్టింగ్‌ స్క్వాడ్లుగా పరీక్ష పూర్తయ్యే వరకు ఉంటారు. పహారా కాసే పోలీసుల సంఖ్యనూ పరీక్షా కేంద్రాల వద్ద పెంచుతున్నారు. ఈ విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది, ఏఎన్​ఎమ్​లు కూడా సెల్‌ఫోన్‌ వినియోగించకుండా నిషేధించారు.

మరోవైపు చాలా కేంద్రాల్లో పార్ట్‌-B లోని 20 మార్కుల బిట్‌ పేపర్‌ సమాధానాలను ఇన్విజిలేటర్లే చెబుతున్నారని.. విద్యార్థులు చూసి రాసుకుంటున్నా నియంత్రించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనలు ఉల్లఘించిన, అలాంటి చర్యలకు పాల్పడినా.. చూస్తూ ఊరుకున్నా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి. పేపర్​లీకేజీ జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Apr 6, 2023, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.