ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి లాభాల్లో 28 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా చెల్లించనున్నట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి 993 కోట్ల 86 లక్షల రూపాయల నికర లాభాలు రాగా.. అందులో 278 కోట్ల 28 లక్షల రూపాయలను బోనస్‌గా చెల్లిస్తామన్నారు.
ఒక్కో కార్మికునికి 60వేల 468 రూపాయల బోనస్ వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మార్చినెలలో కోత విధించిన జీతాన్ని కూడా బోనస్‌తో కలిపి ఈనెల 23 కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు సీఎండీ వెల్లడించారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా దసరా పండుగ సందర్భంగా ఒక్కొక్కరికి అడ్వాన్సుగా ఇస్తున్న 25 వేల రూపాయలను అదే రోజున ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: యాసంగి పంటల సాగుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష