ETV Bharat / state

మార్చి నాటికి మూడు కోట్ల టన్నుల ఉత్పత్తే లక్ష్యం: సీఎండీ - సింగరేణి సమీక్ష

రాబోయే ఏడాది మార్చినాటికి మూడు కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా పని చేయాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. వివిధ ఏరియాల మేనేజర్లు, డైరెక్టర్లతో హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు.

Singareni target three crore tones coal next march
మార్చి నాటికి మూడు కోట్ల టన్నుల ఉత్పత్తే లక్ష్యం: సీఎండీ
author img

By

Published : Nov 3, 2020, 8:41 PM IST

లాక్​డౌన్​ సడలింపులతో బొగ్గుకు డిమాండ్ పెరిగినందున ఉత్పత్తి పెంచాలని అధికారులను సింగరేణి సీఎండీ ఎన్​.శ్రీధర్ ఆదేశించారు. పలు ఏరియాల మేనేజర్లు, డైరెక్టర్లతో హైదరాబాద్​లోని సింగరేణి భవన్​ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా సమీక్షించారు.

వచ్చే మార్చినాటికి మూడు కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి, రవాణా చేయాలని లక్ష్యం విధించారు. డిమాండ్​కు తగ్గట్టుగా రోజుకు 85 వేల టన్నులు ఉత్పత్తి చేయాలన్నారు. ఓపెన్​ క్యాస్ట్​ గనుల నుంచి పదమూడున్నర లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డన్​ తొలగించాలని సీఎండీ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కంపెనీ ఎండీపై ఉద్యోగులు హెచ్​ఆర్సీలో ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.