ETV Bharat / state

ఉపాధి ఊతం.. సింగరేణితో కొత్త జీవితం!

బొగ్గు, విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతికి దోహదపడుతున్న సింగరేణి సంస్థ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలోనూ చొరవ చూపుతోంది. ఏటా రూ.మూడు కోట్లతో సింగరేణి సేవా సమితి వివిధ రకాల శిక్షణలను అందిస్తూ చేయూతనందిస్తోంది. దీనివల్ల నిరుపేదలు, వ్యవసాయ కూలీల కుటుంబాల్లో వెలుగులు నిండుతున్నాయి. అవసరమైన సందర్భాల్లో బెంగళూరు, హైదరాబాద్‌లకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నారు.

ఉపాధికి సింగరేణి ఊతం
ఉపాధికి సింగరేణి ఊతం
author img

By

Published : Feb 16, 2021, 8:14 AM IST

తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత, గత ఆరేళ్లలో సింగరేణి సంస్థ 12,558 మందికి పది విభాగాల్లో స్వయం ఉపాధి వృత్తుల్లో శిక్షణ అందించింది. ప్రత్యేక ఆర్మీ రెక్రూట్‌మెంట్‌ శిక్షణ ద్వారా ఇప్పటికే వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు సాధించారు. ఏటా సుమారు 1,500 మందికి నిష్ణాతులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. గత ఏడాది ప్రయోగాత్మకంగా మూడు చోట్ల క్యాంపులు నిర్వహించి రెండు నెలల పాటు రెసిడెన్షియల్‌ తరహా శిక్షణ ఇప్పించారు. ఈ ప్రత్యేక శిక్షణ వల్ల 35 మంది ఆర్మీకి ఎంపికయ్యారు. గత ఏడాది పోలీసుశాఖ నిర్వహించిన ఎస్‌.ఐ, కానిస్టేబుల్‌ పోస్టుల ఎంపికలో ఇక్కడ శిక్షణ పొందిన 110 మంది సింగరేణి ప్రాంత యువత ఎంపికయ్యారు. 12 మంది ఎస్‌.ఐ. పోస్టులు సాధించారు.

ఆయా వస్తువుల విక్రయానికి ఏర్పాట్లు

శిక్షణ పొందిన వారు తాము తయారుచేసిన వస్తువులను విక్రయించటానికి ఏటా హైదరాబాద్‌లో నిర్వహించే ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌లో ఒక స్టాలును ఏర్పాటు చేసి అవకాశమిస్తున్నారు. ఉప్పల్‌ శిల్పారామంలో కూడా స్టాలు ఏర్పాటుచేసి వస్తువులు విక్రయిస్తున్నారు. శ్రీరాంపూర్‌, మందమర్రి వంటి చోట్ల ఏర్పాటుచేస్తున్నారు. వీటి నిర్వహణ ఖర్చులన్నీ సింగరేణి భరిస్తోంది.

ఇక్కడ శిక్షణ పొందిన యువతుల్లో 3,494 మంది ఇప్పటికే స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించుకున్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగటానికి ఎం.ఎస్‌.ఎం.ఇ.సంస్థ (హైదరాబాద్‌) 50 మంది మహిళలకు శిక్షణ ఇప్పించింది. ఇందులో కొందరు సొంత వ్యాపారాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించా

పద్మావతి, కొత్తగూడెం

పేపరుబ్యాగుల తయారీలో శిక్షణ పొందా. రోజుకు 200 పేపరు బ్యాగులు తయారు చేస్తూ మొదట చిన్న కుటీరపరిశ్రమ ప్రారంభించా. ఇప్పుడు దాన్ని విస్తరించి 100 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పించగలిగా.

- పద్మావతి, కొత్తగూడెం

హైదరాబాద్‌, బెంగళూరుల్లోనూ శిక్షణ

జీఎంఆర్‌ నిర్మాణ సంస్థ, టీఎన్‌ఆర్‌ సైనిక అకాడమీ, వోల్వో సంస్థల సహకారంతో హైదరాబాద్‌, బెంగళూరుల్లో శిక్షణ అందిస్తున్నాం. శ్రీసరస్వతీ మహిళా గృహ ఉద్యోగ్‌ సంస్థ ద్వారా పచ్చళ్లు, కేకుల తయారీలో శిక్షణ ఇప్పించాం.

- సేవా సమితి కోఆర్డినేటర్‌ మహేష్‌

సామాజిక బాధ్యతతో పనులు

ఒక సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నాం. ఈ ఏడాది మార్చి నెలలో హకీంపేట గ్రౌండ్‌లో నిర్వహించబోయే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనేందుకు 550 మందిని ఎంపిక చేసి రిటైర్డ్‌ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో శిక్షణ అందిస్తున్నాం.

- కె.రవిశంకర్‌, జనరల్‌మేనేజర్‌ (కోఆర్డినేషన్‌), సేవాసమితి ఉపాధ్యక్షులు

సింగరేణి సంస్థకు రుణపడ్డా

- డి.రాజా, బెల్లంపల్లి

మా నాన్న వ్యవసాయ కూలీ. శ్రీరాంపూర్‌ శిక్షణ శిబిరంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ శిక్షణ పొందా. ఇప్పుడు ముంబయి ఆర్మీ క్యాంపులో ఉద్యోగం చేస్తున్నా. సింగరేణి సంస్థకు రుణపడ్డా.

- డి.రాజా, బెల్లంపల్లి

ఇదీ చూడండి : 'నిధులు కేటాయిస్తే అభినందన సభ.. లేదంటే ఉద్యమ సభ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.