పీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. గాంధీభవన్‌లో కోదండరెడ్డి అధ్యక్షతన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశమై కొన్ని రోజులుగా అందుతున్న ఫిర్యాదులపై చర్చించింది. వివిధ సందర్భాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు మానవతరాయ్, బక్క జడ్సన్‌లు చేసిన వ్యాఖ్యలపై గతంలోనే క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది.
ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని స్యయంగా ఆ ఇద్దరు... పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. తమ వ్యాఖ్యలతో ఎవరైనా బాధ పడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతామని కూడా విజ్ఞప్తి చేశారు. సీనియర్ నేత వి.హనుమంత రావును స్వయంగా కలిసి క్షమాపణ చెప్పి, వివరణ ఇవ్వనున్నట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ కమిటీకి తెలియజేశారు.
పీసీసీ ప్రధాన కార్యదర్శిగా తాను పార్టీకి నష్టం కలిగించేటట్లు ఇకపై మీడియాతో మాట్లాడనని బక్క జడ్సన్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. నాగర్‌కర్నూల్ జిల్లా నుంచి అందిన ఫిర్యాదులపై టీపీసీసీ అధికార ప్రతినిధి సతీశ్ మాదిగకు ఇవాళ షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు క్రమశిక్షణ కమిటీ తెలియజేసింది.
ఇదీ చదవండి: ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే: కె. లక్ష్మణ్