ETV Bharat / state

సీనియర్‌ అసిస్టెంట్లే సబ్‌రిజిస్ట్రార్లు!

రాష్ట్రానికి అత్యధిక ఆదాయం ఆర్జించే కీలకమైన రిజిస్ట్రేషన్‌ శాఖలో సుమారు మూడో వంతు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్లతో నడుస్తున్నాయి. పలుచోట్ల డిప్యుటేషన్‌పైనే సబ్‌రిజిస్ట్రార్లు విధులు నిర్వహిస్తున్నారు. సుమారు 40 కార్యాలయాలు సీనియర్‌ అసిసెంట్లతోనే నడస్తుండటం గమనార్హం.

సీనియర్‌ అసిస్టెంట్లే సబ్‌రిజిస్ట్రార్లు

author img

By

Published : Feb 8, 2021, 7:33 AM IST

రాష్ట్రంలో 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా 50 చోట్ల ఇన్‌ఛార్జులే ఉన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ వ్యవసాయేతర లావాదేవీలకే పరిమితం కాగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు తహసీల్దార్‌ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. గతంలో ఏటా సుమారు 15 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్‌ శాఖలో ఖాళీలను దృష్టిలో ఉంచుకుని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 23 మంది సబ్‌రిజిస్ట్రార్లను నియమించారు. వీరు శిక్షణ పూర్తి చేసుకుని వివిధ కార్యాలయాల్లో సహాయకులుగా పనిచేస్తూ.. రెగ్యులర్‌ పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

రాష్ట్రంలో అత్యధికంగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో జరుగుతున్నాయి. కీలకమైన ఉప్పల్‌, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్‌, సరూర్‌నగర్‌, గోల్కొండ కార్యాలయాల్లో నిత్యం అధికంగా లావాదేవీలు జరుగుతాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో మూడో వంతు మంది ఇన్‌ఛార్జి సబ్‌రిజిస్ట్రార్‌లు లేదా డిప్యుటేషన్‌పై ఉన్నవారే కావడం గమనార్హం.

కరీంనగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో 50 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా వీటిలో 40 శాతం ఇన్‌ఛార్జులతో నడుస్తున్నాయి. 12 జిల్లా రిజిస్ట్రార్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాల్లో కీలకమైన సబ్‌రిజిస్ట్రార్లను నియమించే అంశంపై సీఎస్‌ ఇటీవల సమీక్ష నిర్వహించినట్లు విశ్వసనీయ సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.