కొవిడ్-19 బాధితుల చికిత్సలో వినియోగించే 2-డీజీ ఔషధాన్ని శిల్పా మెడికేర్ ఉత్పత్తి చేయనుంది. దీనిపై డీఆర్‌డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) నుంచి అనుమతి పొందినట్లు శిల్పా మెడికేర్ వెల్లడించింది. 2-డీజీ ఔషధానికి మనదేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పటికే డీఆర్‌డీఓ భాగస్వామ్యంతో డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఈ ఔషధాన్ని వినియోగంలోకి తీసుకువచ్చింది. కానీ ఈ మందు లభ్యత ఇంకా పరిమితంగానే ఉంది. అందువల్ల లభ్యతను పెంపొందించే దిశగా ఇతర కంపెనీలను ప్రోత్సహించాలని డీఆర్‌డీఓ భావిస్తోంది. ఇందులో భాగంగా 2-డీజీ మందు ఉత్పత్తికి ముందుకు వచ్చే ఫార్మా కంపెనీలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించటానికి సిద్ధపడుతోంది. ఈ కోవలో శిల్పా మెడికేర్‌కు డీఆర్‌డీఓతో ఒప్పందం కుదిరింది.
ఇదీ చూడండి: Revanth reddy: స్వతంత్ర జడ్పీటీసీ నుంచి టీపీసీసీ అధ్యక్షుడిగా..