ETV Bharat / state

'షీ పాహి'.. అభినందనీయం.. ఎందరికో ఆదర్శం - anushka shetty news

పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల శాతం పెరుగుతోంది. హైదరాబాద్‌లోని కమిషనరేట్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వందల మంది మహిళలు... కానిస్టేబుళ్లు, ఉన్నతాధికారులుగా చేరుతున్నారు. వీరిలో మరింత ఉత్సాహం నింపేందుకు సైబరాబాద్ పోలీసులు ' షీ పాహి' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజంలో పోలీసుల విధులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో నటి అనుష్క పాల్గొన్నారు.

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసులు

author img

By

Published : Jan 27, 2021, 9:38 PM IST

మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసులు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న మహిళలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. 'షీ పాహి' అని పేరుపెట్టి వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వారికి అవార్డులు ఇస్తున్నారు. ఇందుకు కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగుల్ని ఒకే చోట చేర్చారు. ట్రాఫిక్, సైబర్ క్రైం అన్ని విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని సన్మానిస్తున్నారు.

ముఖ్య అతిథిగా నటి అనుష్క

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించిన 'షీ పాహి' కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి అనుష్క శెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు మహిళా భద్రతా విభాగ అదనపు డీజీ స్వాతి లక్రా, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ పాల్గొన్నారు. మూడు క్విక్ రెస్పాన్స్ వాహనాలు, షీ షటిల్ వాహనాన్ని ప్రారంభించారు. ఆ వాహనాల్లో కొద్ది దూరం ప్రయాణించారు. సైబరాబాద్‌లో 12 శాతం మహిళా పోలీసులు ఉన్నారని సజ్జనార్ తెలిపారు. మహిళా శక్తిని ఉపయోగించి మెరుగైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శం

మహిళల భద్రత కోసం 2014లో మొదలు పెట్టిన షీటీమ్స్ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. విధి నిర్వహణలో స్త్రీ, పురుషులనే వివక్ష ఉండదని... షీ బృందాల్లో పురుషులు కూడా ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు భరోసా సెంటర్లు ఉన్నాయన్న స్వాతి లక్రా... వీటిని 10కి పెంచుతామన్నారు.

నటిస్తేనే స్టార్ కాదు..

సినిమాలో నటిస్తేనే స్టార్ కాదని...ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని నటీ అనుష్క అన్నారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి అవార్డులు ప్రధానం చేశారు. కొవిడ్ సమయంలో ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. కార్యక్రమానికి వచ్చిన మహిళా పోలీసులను చూసి సంతోషంగా ఉందన్నారు.

ఇదీ చదవండి: ప్రతి మహిళా పోలీసు ఒక స్టార్‌ : సినీనటి అనుష్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.