దీపావళి ఎంత వెలుగుల పండుగో... సరైన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో జీవితాల్లో చీకట్లు నింపుతుంది. దీపావళి సందర్భంగా బాణాసంచా విక్రేతలు నిబంధనలు పాటించాలని హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని... జనవాసాల్లో దుకాణాలను ఏర్పాటు చేయకూడని చెప్పారు. పోలీసులతో కలిసి నిరంతంర పర్యవేక్షణ సాగిస్తామని... ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.. బాణాసంచా విక్రేతలు నియమ నిబంధనల ప్రకారం దుకాణాలు ఏర్పాటు చేసి ప్రమాదాలకు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపక శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు... 8మందికి గాయాలు