Nepali gang Arrested in Secunderabad theft case : సికింద్రాబాద్ రాంగోలపాల్ పేట పిఎస్ పరిధిలోని వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సింధికాలనీ డిమ్మీ పాన్‌షాప్ ప్రాంతంలో రాహుల్ గోయల్ తన నలుగురు అన్నదమ్ముల కుటుంబాలతో కలిసి ఒకేచోట ఉంటున్నారు. రాణిగంజ్ ప్రాంతంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం నాలుగు కుటుంబాలు శివారు ప్రాంతంలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరిగి వచ్చిన కుటుంబసభ్యులు ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు.
Secunderabad Theft Case latest update : ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా బంగారు, వజ్రభరణాలు, నగదు చోరికు గురైనట్టు కుటుంబ సభ్యులు గుర్తించారు. ఇంకా వారు గమనించిన సంగతి ఏంటంటే.. వారింట్లో 5 ఏళ్లుగా పని చేస్తున్న నేపాల్ కు చెందిన కమల్, భార్య, ఇద్దరు పిల్లలు ఎవ్వరూ కనిపించలేదు. సోమవారం రాత్రి నలుగురు కనిపించకపోవడంతో పనివాళ్లే దొంగతనం చేసినట్టు నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటిని.. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇంట్లోని బంగారు గొలుసులు, బంగారు-వజ్రాల బ్రాస్‌లెట్స్, ఉంగరాలు, బంగారు, వెండి నాణాలు, బంగారు బిస్కెట్లు, బంగారు, వెండి గాజులు, నెక్లెస్ లు అన్ని కలిపి దాదాపు 4 కిలోలు చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. వాటితో పాటు రూ.49 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ. 4కోట్ల నుంచి 5 కోట్ల విలువైన సొత్తు మాయమైనట్టు వెల్లడించారు. ఇంటి పనివాళ్లపై అనుమానంతో ఇంట్లోని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు అనుమానితుల ఆధారాలు సేకరించారు. వారిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. కాగా ఒక బృందం ముంబయి చేరినట్టు సమాచారం రావడంతో అనుమానితుల ఫొటోలను రైల్వే, బస్స్టేషన్లకి పంపించారు. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నార్త్‌జోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎట్టకేలకు నిందితులను ముంబయిలోని మధుర బస్‌స్టేషన్‌లో పట్టుకున్నారు. నిందితుడు కమల్.. అతడి భార్య, ఇద్దరు పిల్లలు, సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి కమల్ అక్కడినుంచి పారిపోయాడు. యజమాని వద్ద నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ... తన సోదరుడు డబ్బుల ఆశ చూపించి కమల్‌ను చోరీకి ప్రోత్సహించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చోరీ చేసిన వెంటనే నేపాల్‌కు ఎలా పారిపోవాలో ముందే ప్రణాళిక రచించుకున్నట్లు గుర్తించారు. అతడి ఆచూకీ కోసం మధుర బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. వారి నుంచి రూ.5.5 కోట్ల విలువ చేసే బంగారు నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి: