ETV Bharat / state

Police Notices to Mallu Ravi: మల్లు రవికి మరోసారి నోటీసులిచ్చిన పోలీసులు

Police Notices to Mallu Ravi: టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి పోలీసులు మరో నోటీసు ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ ఫోటో మార్పింగ్‌ చేసి పోస్ట్ చేశారని బీఆర్ఎస్ నేత ఫిర్యాదుతో.. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈనెల 8న విచారణకు హాజరుకావాలని పోలీసులు అందులో పేర్కొన్నారు.

Mallu Ravi
Mallu Ravi
author img

By

Published : Feb 4, 2023, 4:56 PM IST

Updated : Feb 4, 2023, 5:29 PM IST

Police Notices to Mallu Ravi: టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవికి పోలీసులు మరో నోటీసు ఇచ్చారు. సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఈవేళ గాంధీభవన్​లో ఆయనకు సీఆర్పీసీ 41 (ఏ) కింద నోటీసులు అందచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్​బుక్​లో పోస్ట్ చేశారన్న అభియోగంపై బీఆర్ఎస్ నాయకుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలోనే మల్లు రవిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈనెల 8న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నట్లు ఎస్ఐ మమత తెలిపారు.

కాంగ్రెస్‌ పార్టీని ఇబ్బంది పెట్టడం తప్ప.. ఈ కేసులో ఏమి లేదంటూ: కాంగ్రెస్ వార్​ రూమ్ కేసులో ఇప్పటికే నోటీసులు తీసుకొని విచారణకు హాజరయ్యానని మల్లు రవి తెలిపారు. మళ్లీ సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు ఈరోజు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టి ఆలోచనలే తప్ప.. ఇందులో కేసు ఏమీ లేదని ఆయన కొట్టిపారేశారు. ఇదే కేసులో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కొనుగోలుతో పాటు మరో ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఆ నలుగురు అందుబాటులో లేకపోవడంతో వారికి సంబంధించినవి కూడా మల్లు రవికే అందచేశారు.

గతంలోనూ కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్​లో పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిని పోలీసులు విచారించారు. కాంగ్రెస్ వార్ రూమ్‌కు తానే బాధ్యుడిగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సునీల్‌కు.. కాంగ్రెస్ వార్ రూమ్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని తెలిపారు. సునీల్‌తో పాటు మిగతా ఉద్యోగుల వివరాలను పోలీసులకు తెలిపినట్లు వివరించారు. కాంగ్రెస్ వార్ రూమ్‌ ద్వారా పోస్టవుతున్న వీడియోలకు తానే బాధ్యుడిని అని అన్నారు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తమకు లేదని.. నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టింగ్‌లు చేస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు.

"ఓ ఫేస్​బుక్ పోస్ట్​పై కేసు పెట్టామని పేర్కొన్నారు. వార్ రూమ్ ఇంఛార్జ్​గా నేను ఉన్నాను. కావున మాపై బీఆర్ఎస్ నేత సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఈ నెల 8న పోలీస్ స్టేషన్​లో హాజరుకావాలని తెలిపారు." - మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు

మల్లు రవికి మరో నోటీసులిచ్చిన పోలీసులు

ఇవీ చదవండి: మాది కుటుంబ పాలనే.. 4 కోట్ల మంది మా కుటుంబం: కేటీఆర్

అసెంబ్లీలో అదానీ ఇష్యూ.. బీఆర్​ఎస్​, బీజేపీ సభ్యుల మధ్య వాగ్వాదం

విద్యుత్​ సైకిల్ రూపొందించిన పదో తరగతి విద్యార్థి.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 90 కి.మీ ప్రయాణం

Last Updated : Feb 4, 2023, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.