ETV Bharat / state

Singareni : విపత్కాలంలోనూ అనుకూల ఫలితాలు

కరోనా కష్టకాలంలోనూ వందశాతం పైగా ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్నామని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది. జులైలో నిర్దేశిత లక్ష్యానికి మించి ఉత్పత్తి సాధించామని తెలిపింది.

sccl
sccl
author img

By

Published : Aug 2, 2021, 10:34 PM IST

కరోనా కష్టకాలంలోనూ సింగరేణి సంస్థ ఉత్పత్తి లక్ష్యాలలో దూసుకుపోతోంది. జులై నెలలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి 47.56 లక్షలు కాగా.. సింగరేణి సంస్థ 102.34 శాతంతో 48.67 లక్షల ఉత్పత్తిని సాధించింది. జులైలో నిర్దేశిత బొగ్గు రవాణా లక్ష్యం 45.56 లక్షల టన్నులు కాగా దీనిని అధిగమించి 110.39 శాతంతో 50.29 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసిందని సింగరేణి సంస్థ ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరం జులైలో సాధించిన బొగ్గు ఉత్పత్తి 28.5 లక్షల టన్నులతో పోలిస్తే ఏడాది జులైలో 70.65 శాతం వృద్ధిని సాధించింది. అలాగే బొగ్గు రవాణాలో గత జులై నెలలో సాధించిన 29.1 లక్షల టన్నులతో పోలిస్తే ఈ ఏడాది 72.9 శాతం వృద్ధిని సాధించింది. కాగా గత ఏడాది జులైలో 477 రేకుల ద్యారా బొగ్గు రవాణా చేసిన సింగరేణి ఈ ఏడాది 91.6 శాతం వృద్ధితో 914 రేకుల ద్యారా బొగ్గు రవాణా చేసింది. ఓవర్‌ బర్డెను తొలగింపులో కూడా సింగరేణి గణనీయమైన వృద్ధిని నమోదుచేసింది.

జులై నెలలో 296.16 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబి లక్ష్యాన్ని పెట్టుకొన్న సింగరేణి 257.6 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓబి సాధించింది. గత ఏడాది ఇదే నెలలో తీసిన ఓవర్‌ బర్డెను 195.2 లక్షల క్యూబిక్‌ మీటర్లతో పోలిస్తే ఇది 32 శాతం అధికమని అధికారులు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి జులై నెల వరకూ గల 4 నెలల కాలంలో సింగరేణి 123.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించగా, ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నుంచి జులై వరకూ 204.36 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించి, 65.43 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే గతేడాది ఇదే నాలుగు నెలల కాలంలో 113.8 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిపిన సింగరేణి... ఈ ఏడాది గడచిన నాలుగు నెలల్లో 217.25 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి 91 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఇదీ చూడండి: CM KCR: సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. కార్మికుల పదవీ విరమణ వయసు పెంపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.