ETV Bharat / state

'జీవో నం.2 పేరిట ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మొండి చేయి' - తెలంగాణ వార్తలు

పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం ఆందోళన చేపట్టింది. విద్యాశాఖ తీసుకొచ్చిన జీవో నం.2 వల్ల పదేళ్లుగా పదోన్నతులు పొందలేకపోతున్నామని సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

sc-st-teachers-association-protest-for-promotion-at-director-of-school-education-office-in-hyderabad
'జీవో నం.2 పేరిట ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మొండి చేయి'
author img

By

Published : Jan 29, 2021, 12:21 PM IST

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను విద్యాశాఖ అధికారులు నీరు గార్చడాన్ని నిరసిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్​లో ఆందోళనకు దిగింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. విద్యాశాఖ తీసుకొచ్చిన జీవో నం.2 వల్ల పదేళ్లుగా పదోన్నతులు పొందలేకపోతున్నామని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల వెంకట్ ఆవేదన వ్యక్తం చేశారు.

జీవోలో అడెక్వసీ అనే పదాన్ని చూపెడుతూ... ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులను అన్యాయానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, వికలాంగులకు 3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించినా... జీవో నం.2 ను చూపిస్తూ మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు.

పాఠశాల విద్యాశాఖలో 4 వేల పదోన్నతుల పోస్టులు ఉంటే... ఎస్సీ, ఎస్టీలకు జిల్లాకు ఒక్క పోస్టు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న జీవో నం.2ను రద్దు చేసి... రిజర్వేషన్లకనుగుణంగా పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు సదానంద్ గౌడ్ మద్దతు తెలిపారు.

ఇదీ చదవండి: నిరుద్యోగులకు శుభవార్త... భృతిపై ఒకట్రెండు రోజుల్లో ప్రకటన!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.