బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చేప్పేందుకు.. జీవో 59 నిదర్శనమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. సింగరేణి కాలరీస్ సంస్థలో జీవో అమలును పురస్కరించుకుని.. హైదరాబాద్‌లోని మారియట్ హోటల్లో, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత ఇండస్ట్రీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించిన సదస్సుల్లో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
జీవో అమలుతో.. గిరిజన జాతులు ఆర్థికంగా బలపడతాయని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. జీవోపై ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో.. ఎమ్మెల్సీ గువ్వల బాలరాజు, కమిషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'హైదరాబాద్ ఐటీఐఆర్‌కు ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ప్రకటించాలి'