ETV Bharat / state

ముగిసిన సంక్రాంతి సంబరాలు.. అలరించిన 'కోడెబళ్లు పందేలు' - Lolugu village latest news

Sankranti Celebrations in AP: సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీలో శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామీణ క్రీడల్లో భాగంగా హిందూ సాంసృతిక, సాంప్రదాయ పద్దతిలో తమిళనాడులో జరిగే జల్లికట్టు రీతిలో.. పొందూరు మండలం లోలుగు గ్రామంలో కోడెబళ్లు పందేలను గ్రామస్థులు అట్టహాసంగా నిర్వహించారు. మరోవైపు నరసరావుపేటలో సంక్రాంతి చివరి రోజున డాన్స్‌లు, మిమిక్రీలు, జబర్దస్త్ టీమ్, గాయకుల ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు కోలాహలంగా ముగిశాయి.

san
san
author img

By

Published : Jan 17, 2023, 4:47 PM IST

Sankranti Celebrations in AP: సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం లోలుగు గ్రామంలో నిర్వహించిన గ్రామీణ క్రీడలు అట్టహాసంగా జరిగాయి. హిందూ సాంసృతిక సాంప్రదాయ పద్దతిలో.. తమిళనాడులో జరిగే జల్లికట్టు రీతిలో కోడెబళ్లు పందేలను గ్రామ పెద్దలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పురాతన పల్లె సంస్కృతిని ప్రతీ ఏటా కనుమ రోజున రైతులు వేడుకగా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. సంబరాలు అంబరాన్ని తాకేలా క్రీడలు జరుపుకున్నారు.

కోడెబళ్లు పందేరం: ప్రతిసారి ఎటువంటి రక్తపాతం, గొడవలు జరగకుండా గ్రామస్థులే అన్ని ఏర్పాట్లను చూసుకుంటారు. సిక్కోలు జిల్లా ఖాదీ చేనేతకు ప్రసిద్ధి గాంచిన పొందూరు మండలం.. లోలుగు గ్రామంలో లోలుగు కాంతారావు ఆధ్వర్యంలో జల్లికట్టు లాంటి క్రీడను నిర్వహించారు. ఇక్కడ దీన్ని 'కోడెబళ్లు పందేరం' అని పేరుతో పిలుచుకుంటారు. రైతులు తమ ఇళ్ల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ఎద్దులను ప్రత్యేకంగా అలంకరిస్తారు.

వేల సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు: పాడిపంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలని పూజించారు. అనంతరం కాలికి ఎద్దులను కట్టి ముందుగా పొలం దున్నుతారు. తరువాత కోడెబళ్ళు పందేరానికి తీసుకువస్తారు. దీన్ని చూసెందుకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి.. వేల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పందెరానికి నాగలి పూని దానికి పూజలు చేస్తారు. ముందు యువకులు పరిగెడుతుంటే వారి వెనుక ఎద్దులు పరుగులు తీస్తాయి. దైర్యం ఉన్న యువత ఎద్దులను రెచ్చగొడుతూ వాటి కంటే వేగంగా పరిగెడతారు.

తమిళనాడు రాష్ట్రంలో ఎద్దులను రెచ్చగొట్టి ఒంటరిగా వదిలేస్తారు.. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం జొడెద్దులను కాలికి కట్టి, మనుషులు కూర్చుంటారు. ఎటువంటి హింసకు తావు లేకుండా అందరూ కలిసి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. లోలుగు కుల దైవం అయినటువంటి అశిరితల్లి ఆలయం నుంచి పోటీలను ప్రారంభించారు. జెడ్పీటీసీ లోలుగు కాంతారావు, లోలుగు ధనలక్ష్మీ చేతుల మీదుగా ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ , ద్వితీయ, తృతీయ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో యువకులు, ప్రజలు పాల్గొన్నారు.

మరోపక్క పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కోడెల స్టేడియంలో.. గత నాలుగు రోజులుగా కొనసాగిన సంక్రాంతి సంబరాలు.. సోమవారం రాత్రితో ముగిశాయి. చివరి రోజున డాన్స్‌లు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, జబర్దస్త్ టీమ్ రాజమౌళి, గాయకులు సింహ, సుమంత్, సునందలు తమ గానాలతో ప్రజలను ఆకట్టుకున్నారు. అదేవిధంగా స్టేజీపై పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు మరోమారు డాన్స్‌లు వేసి ప్రజలను అలరించారు. సంక్రాంతి సంబరాలు సోమవారం రాత్రితో ముగియనున్న సందర్భంగా పట్టణ, పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తండోపతండాలుగా కోడెల స్టేడియంకు తరలివచ్చారు.

ఇవీ చదవండి: దావోస్​ వేదికగా... తెలంగాణ పెవిలియన్​కు పెట్టుబడుల ప్రవాహం

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలం పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.