'నా సోదరులే నా భర్త నీరజ్‌ను హత్య చేశారు. ఏడాదిగా నీరజ్‌ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి.' -సంజన, నీరజ్ భార్య
నా సోదరులే నీరజ్‌ను హత్య చేశారు..: రెండు నెలల బాబుతో సంజన ధర్నా
Neeraj murder: హైదరాబాద్ బేగంబజార్‌లో పరువు హత్య నేపథ్యంలో బేగంబజార్ కూడలిలో మృతుడు నీరజ్ భార్య సంజన రెండు నెలల వయసున్న బాబుతో ధర్నాకు దిగారు. సంజన మాత్రం సోదరులే తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తోంది. ఏడాదిగా సోదరులు నీరజ్‌ను బెదిరిస్తున్నట్లు చెబుతున్న సంజన పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు వెనక్కితగ్గలేదని ఆవేదన చెందుతున్నారు. తన భర్తను పొట్టనబెట్టుకున్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బేగంబజార్ కూడలిలో రెణ్నెళ్ల బాబుతో ధర్నాకు దిగింది. అనుమానితులను గుర్తుపట్టేందుకు సంజనను పోలీసులు ఠాణాకు తీసుకెళ్లారు.
నీరజ్ హత్య కేసు
'నా సోదరులే నా భర్త నీరజ్‌ను హత్య చేశారు. ఏడాదిగా నీరజ్‌ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా వెనక్కి తగ్గలేదు. నిందితులను కఠినంగా శిక్షించాలి.' -సంజన, నీరజ్ భార్య