తల్లిపాలు అమృతం కన్నా విలువైనవని, వాటిని జాగ్రత్తగా వాడుకోవాలని టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా... రెయిన్ బో ఆసుపత్రి ఏర్పాటు చేసిన మధర్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. తాను తల్లయ్యాకే తల్లిపాల గొప్పతనాన్ని తెలుసుకున్నానని సానియా అన్నారు. తమ పిల్లలకు ఇచ్చిన తర్వాత అదనంగా ఉన్న పాలను ఈ మిల్క్ బ్యాంక్‌కి అందించటం వల్ల తల్లిపాలు అందుబాటులో లేని చిన్నారులకు ఉపయోగపడతాయన్నారు.
ఇవీ చూడండి: తీర్పు రిజర్వ్: కూల్చడమా.. మిగల్చడమా?