salman khan green india challenge in Rfc: చెట్టు లేనిదే మనిషి జీవితం లేదని.. మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువు లాంటివని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సల్మాన్... రామోజీ ఫిలింసిటీలోని సాహస్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
salman khan latest movie shooting: సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం కోసం రామోజీ ఫిలింసిటీకి వచ్చారు. గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ ఆవశ్యకత, ఉద్యమ స్థాయిలో సాగుతున్న వృక్ష సంపద వృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఎంపీ సంతోశ్.. సల్మాన్‌కు వివరించారు. ఐదేళ్ల క్రితం తాను చేపట్టిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ద్వారా ఇప్పటి వరకు 16 కోట్లకు పైగా మొక్కలు నాటించినట్లు సంతోశ్ తెలిపారు.
salman khan Praises mp santosh: భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోశ్ కుమార్‌ను సల్మాన్ ప్రశంసించారు. 16 కోట్లు మొక్కలే కాదు... భవిష్యత్‌లో సంతోశ్ ఆశయంతో అమెజాన్ ఫారెస్ట్ తరహాలో పెద్ద వృక్షసంపద సమకూరుతుందని ప్రశంసించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోశ్ ఆశయానికి తోడ్పడాలని కోరారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యం సాధ్యమని... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనాలని సల్మాన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
''మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువు లాంటివి. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం. భవిష్యత్‌లో సంతోశ్ ఆశయంతో అమెజాన్ ఫారెస్ట్ తరహాలో పెద్ద వృక్షసంపద సమకూరుతుంది. ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోశ్ ఆశయానికి తోడ్పడాలి.''- సల్మాన్‌ఖాన్, బాలీవుడ్ హీరో
green india challenge in Antarctica: మరోవైపు దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంచు ఖండం అంటార్కిటికాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పతాకం రెపరెపలాడింది. పర్యావరణ హితం కోసం కర్బన ఉద్గారాలను తగ్గించాలనే సంకల్పంతో చేపట్టిన అంటార్కిటికా యాత్రలో.... 35 దేశాల నుంచి 150 మంది సభ్యులున్న బృందంతో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అంటార్కిటికాలో పర్యటించింది. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణం పరంగా ఎదురయ్యే సవాళ్ల పై ఈ బృందం అధ్యయనం చేస్తోంది. ఫౌండేషన్ - 2041 నెలకొల్పి పర్యావరణ హితం కోసం ఉద్యమం చేపట్టిన రాబర్ట్ స్వాన్‌ను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాలంటీర్ కలిసి.... భారతదేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం విస్తరిస్తున్న తీరును వివరించారు. ఉత్తర, దక్షిణ ధృవాలను రెండింటినీ సందర్శించి, పర్యావరణం కోసం పాటు పడుతున్న వ్యక్తిగా రాబర్ట్ స్వాన్‌ను ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
-
#GreenIndiaChallenge goes to the South Pole. We are honoured as Sir #RobertSwan, a Polar explorer & Sustainability leader of the OBE recognised our efforts and hoisted our #GIC #Flag on the #Antarctica.
— Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Thank You so much Sir🙏#CFA22@sobbanaabhishek@robertswan2041@Barney_Swan pic.twitter.com/7XvYW1BcKu
">#GreenIndiaChallenge goes to the South Pole. We are honoured as Sir #RobertSwan, a Polar explorer & Sustainability leader of the OBE recognised our efforts and hoisted our #GIC #Flag on the #Antarctica.
— Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022
Thank You so much Sir🙏#CFA22@sobbanaabhishek@robertswan2041@Barney_Swan pic.twitter.com/7XvYW1BcKu#GreenIndiaChallenge goes to the South Pole. We are honoured as Sir #RobertSwan, a Polar explorer & Sustainability leader of the OBE recognised our efforts and hoisted our #GIC #Flag on the #Antarctica.
— Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022
Thank You so much Sir🙏#CFA22@sobbanaabhishek@robertswan2041@Barney_Swan pic.twitter.com/7XvYW1BcKu
ఇదీ చూడండి: 'కార్మికులకు వేతనాలు పెంచేందుకు నిర్మాతలు సిద్ధం'