ETV Bharat / state

ZPTC-MPTC Results: ప్రజల ఆశీస్సులతోనే ఈ ఫలితాలు: సజ్జల

నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర వహించటంలో తెదేపా విఫలమైందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy news). అందుకే పరిషత్ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైందన్నారు. ఏపీ సర్కార్​పై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు పరిషత్ ఎన్నికల ఫలితాలే (parishad elections results) నిదర్శనమన్నారు.

sajjala
sajjala
author img

By

Published : Sep 19, 2021, 9:34 PM IST

ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వసనీయతకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు (parishad elections results) నిదర్శనమని ఆ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(sajjala ramakrishna reddy news) అన్నారు. ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్... రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన ఆశీస్సుల వల్లే ఈ తరహా ఫలితాలు వచ్చాయన్నారు. ప్రభుత్వం నిలకడతో కూడిన అభివృద్ధి, సంక్షేమం అందించగలిగితే ఫలితాలు ఎలా ఉంటాయో ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు. సువర్ణ అక్షరాలతో నిలిచేలా ప్రజలు ప్రభుత్వానికి ఆశీస్సులు ఇచ్చారని, ప్రజల విశ్వాసాన్ని సీఎం జగన్ నిలుపుకున్నారన్నారని వ్యాఖ్యానించారు.

ప్రజల సమస్యలపై పోరాడుతూ నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర తెదేపా పోషించకపోవటం వల్లే.. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కుప్పంలో వైకాపా విజయంపై చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. చాలాచోట్ల తెదేపా పోటీ చేసి ప్రచారం చేశారని.. ఇప్పుడు పోటీ చేయలేదంటున్నారని అన్నారు. ప్రచారం చేసిన వీడియోలూ ఉన్నాయన్నారు. ఇప్పటికైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తెదేపా వ్యవహరించాలని హితవు పలికారు. వైఎస్ జగన్ తరఫున, పార్టీ తరఫున ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు పూర్తి చేయూత ఇచ్చేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్నారు.

ఇదీ చూడండి: ఈ మందుబాబుది పెద్ద సమస్యే.. అది అందరికి తెలవాలని ఏం చేశాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.