ETV Bharat / state

అక్కడ రాళ్లు నడుస్తాయి.. పరిగెడతాయి..!! - how rocks move in death valley

ఈ సృష్టిలో ప్రాణమున్న జీవిలో మాత్రమే చలనం ఉంటుంది. ఒక ప్రాణి మాత్రమే స్వయంగా కదులుతుంది.. ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంది. కానీ.. ఒక రాయి ఈ పని చేస్తుంది అంటే మీరేమంటారు? జీవం లేని రాతిబండ ముందుకు నడుస్తుంది అంటే.. మీ ఫీలింగ్ ఏంటి? "ఇది అసాధ్యం" అంటారా? చెబితే నమ్మరు.. కానీ, చూస్తే నమ్ముతారు కదా! అయితే, రండి.. ఆ రాళ్లు నడిచిన ప్రాంతాన్ని.. అవి పరుగులు తీసిన విధానాన్ని పరిశీలిద్దురుగానీ..

stones
stones
author img

By

Published : Sep 8, 2022, 7:22 PM IST

ఈ విశ్వంలో మనిషి ఛేదించలేని రహస్యాలెన్నో ఉన్నాయి. నమ్మశక్యంకాని సంఘటనలు ఎన్నో జరిగాయి. కానీ.. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది "అంతకు మించి"నది. ఇదిగో.. ఈ కింది ఫొటో చూడండి. ఆ రాయి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ప్రయాణించిందో మీ కళ్లతో మీరే చూడండి. ఈ రాయిని ఎవరో తీసుకొచ్చింది కాదు.. స్వయంగా అదే కదులుతూ వచ్చింది. ఇదొక్కటే కాదు.. ఇక్కడ ఎన్నో పెద్ద పెద్ద రాళ్లు ఇలా నడుస్తూ ఉంటాయి. మరి, ఈ వింత ప్రదేశం ఉన్నది ఎక్కడ? ఈ రాళ్లు కదలడానికి కారణం ఏంటి? అసలేం జరుగుతోందిక్కడ? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు? అన్న వివరాలు తెలుసుకుందాం.

కదిలే రాళ్లు
కదిలే రాళ్లు

కాలిఫోర్నియాలో : ఈ ప్రదేశం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న పానామింట్‌ అనే పర్వతాలకు సమీపంలో ఉందీ ప్రదేశం. ఇక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు.. కానీ, రాళ్లు మాత్రం ప్రాణం ఉన్న జీవుల్లా వాటంతట అవే కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్‌ స్టోన్స్‌, స్లైడింగ్‌ రాక్స్‌, మూవింగ్‌ రాక్స్‌ అనీ.. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇక ఈ రాళ్లు కనీసం 3 క్వింటాళ్లకు పైనే బరువు ఉంటాయి. ఇలాంటి రాళ్లు ముందుకు ప్రయాణిస్తూ ఉంటాయి.

కదిలే రాళ్లు
కదిలే రాళ్లు

ఊహించని టర్న్ : ఈ రాళ్లు ప్రయాణించడమే ఓ మిస్టరీ అంటే.. కొంత దూరం వెళ్లిన తర్వాత.. ఉన్నట్టుండి దిశను మార్చుకుంటాయి. అంటే.. తూర్పు నుంచి పడమరకు వెళ్తున్న రాయి.. ఉత్తరానికో, దక్షిణానికో తిరుగుతుంది. ఇంకొన్ని రాళ్లయితే సడన్ గా ఆగిపోయి.. యూ టర్న్ తీసుకొని తిరిగి తూర్పుకే ప్రయాణిస్తాయి కూడా! ఈ విషయాన్ని ఆ రాళ్ల చారలే మనకు తెలియజేస్తాయి. ఇవి చూసిన సమీప ప్రాంతాల ప్రజలు భయపడేవారు. ఏవో అతీంద్రియ శక్తుల కారణంగానే రాళ్లు ఇలా ప్రయాణిస్తున్నాయని భావించేవారు. అందుకే.. ఆ ప్రాంతం వైపు ఒక్కరు కూడా వెళ్లేవారు కాదు. ఈ విషయం కాల క్రమంలో అందరికీ తెలిసిపోయింది. దీంతో.. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు సైంటిస్టులు ప్రయోగాలు మొదలు పెట్టారు.

కదిలే రాళ్లు
కదిలే రాళ్లు

రంగంలోకి సైంటిస్టులు : 1915లో అమెరికాలోని నెవాడా ప్రాంతానికి చెందిన జోసెఫ్ క్రూక్, ఆ తర్వాత 1948లో.. భూ శాస్త్రవేత్తలు మెక్‌ అలిస్టర్, అలెన్ పరిశోధించి.. నమ్మలేని విషయం చెప్పారు. ఈ రాళ్లు కదలడానికి గాలి కారణమని అన్నారు. వీరి థియరీని అందరూ కొట్టి పారేశారు. 1970లో బాబ్ షార్ప్, డ్వైట్ కారీ మే మరో ప్లాన్ వేశారు. ఆ ప్రాంతంలోని మొత్తం 30 రాళ్లకు గుర్తులు వేశారు. ప్రతి రాయికీ ఒక్కో పేరు పెట్టారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా గుర్తులు గీశారు. అప్పటి నుంచి ఏకంగా 7 సంవత్సరాల పాటు.. వాటి కదలికను కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ గ్యాప్ లో.. మొత్తం 30 రాళ్లలో 2 తప్ప, మిగిలిన 28 రాళ్లు అవి ఉన్న ప్లేస్ నుంచి ముందుకు కదిలాయి. అయితే.. ఇవన్నీ కూడా ఒకేసారి కదల్లేదు. ఇందులో కొన్ని రాళ్లు మొదటి సంవత్సరం చలికాలంలో, మరికొన్ని రెండో సంవత్సరం చలికాలంలో, మిగిలినవి మూడో ఏడాది చలికాలంలో కదిలాయని గుర్తించారు. వేసవి కాలంలో ఏ ఒక్క రాయి కూడా కదల్లేని వాళ్లు గీసిన హద్దుల ద్వారా నిర్ధారించారు. ఈ లెక్కలన్నీ తీసుకొని అసలు.. డెత్ వ్యాలీలో రాళ్లు ఎందుకు కదులుతున్నాయో వివరించారు.

కదిలే రాళ్లు
కదిలే రాళ్లు

ఇదీ అసలు కారణం : ఆ డెత్ వ్యాలీ ప్రాంతమంతా వర్షాకాలంలో ఒక నీటి సరస్సుగా మారుతుంది. ఆ తర్వాత చలికాలం వచ్చే నాటికి కొద్ది కొద్దిగా నీళ్లు తగ్గిపోతుంటాయి. అదే సయంలో మంచు విరీతంగా కురుస్తుంది. దీంతో.. ఉన్న కొద్దిపాటి నీళ్లు గడ్డకట్టిపోతాయి. అప్పుడు ఆ ప్రాంతం మొత్త ఐస్ పలకగా మారిపోతుంది. అప్పుడు వీచే బలమైన గాలుల కారణంగా.. రాళ్లు ఐస్ పలకలమీద నుంచి ముందుకు జారుతున్నట్టు చెప్పారు. ఎండా కాలంలో మంచు ఉండదు కాబట్టి.. అప్పుడు రాళ్లు కదలట్లేదు అని చెప్పారు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే.. కొన్ని రాళ్లు మూడేళ్లకు ఒకసారి మాత్రమే కదులుతాయనే విషయం తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. వాటి కదలికను మరింత పక్కాగా గుర్తించేందుకు.. 2013-14 మధ్య అత్యాధునిక GPS, టైమ్-లాప్స్ ఫొటోగ్రఫీని ఉపయోగించి పరిశోధన చేశారు సైంటిస్టులు. ఈ సమయంలో.. కొన్ని రాళ్లు కొంత దూరం కదలడాన్ని, మరికొన్ని అక్కడే ఉండిపోవడాన్ని గుర్తించారు. మొత్తంగా.. మంచు, ఆ సమయంలో బలంగా వీచే గాలి వల్లనే రాళ్లు కదులుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.

కదిలే రాళ్లు
కదిలే రాళ్లు

కానీ.. ఇంకొన్ని సందేహాలు అలాగే ఉండిపోయాయి. మంచు పలకలు, బలమైన గాలులే కారణమైతే.. అన్ని రాళ్లపైనా మంచు పడుతుంది.. గాలి కూడా అంతటా వీస్తుంది.. మరి ఒక్కో రాయి ఒక్కో విధంగా కదలడం.. మరికొన్ని అసలే కదలకపోవడం ఏంటీ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా.. రాళ్లు ప్రయాణిస్తూ మధ్యలో దిశ మార్చుకోవడం ఏంటీ.. మూడేళ్లకోసారి మాత్రమే కొన్ని రాళ్లు కదలడం ఏంటి..? అని అడుగుతున్నారు. ఇలా.. ఓ వైపు సైంటిస్టులు ఒక థియరీ చెప్తుండగా.. మరోవైపు సందేహాలు ఎదురు నిలుస్తున్నాయి. దీంతో.. ఓ మిస్టరీ ప్లేస్ గా మిగిలిపోయింది "డెత్ వ్యాలీ".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.