ETV Bharat / state

హైదరాబాద్​లో నిర్వహించునున్న హాఫ్​ మారథాన్​కు క్రికెట్​ గాడ్ సచిన్​ తెందూల్కర్​

Sachin Tendulkar To Flag Off Half Marathon In Hyderabad 2023 : హాఫ్ మారథాన్ 2023కు హైదరాబాద్ మరోసారి వేదికగా మారనుంది. ఆదివారం నిర్వహించే ఈ వేడుకకు క్రికెట్ సూపర్ స్టార్ సచిన్ తెందూల్కర్ రానున్నారు. నవంబర్ 5న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

Sachin Tendulkar
Sachin Tendulkar To Flag Off Half Marathon In Hyderabad 2023
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 3, 2023, 6:48 PM IST

Sachin Tendulkar To Flag Off Half Marathon In Hyderabad 2023 : ఈనెల 5న హైదరాబాద్​లో జరగనున్న హాఫ్ మారథాన్​ను కిక్రెటర్ గాడ్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ మారథాన్​లో దాదాపు 8000 మంది రన్నర్లు పాల్గోంటారు. ఎన్​ఈబీ స్పోర్ట్స్​ ఆధ్వర్యంలో ఈ మారథాన్​ను ​ మూడు విభాగాలుగా జరపనున్నారు. ఆదివారం జరిగే ఈ కార్యక్రమంలో 21.1కిలోమీటర్ల మారథాన్ ఉదయం 5:15 గంటలకు ప్రారంభం అవుతుంది. 10కే రన్​ 6:30కి, 5కే రన్ ఉదయం 7గంటలకు మొదలవుతుంది.

Sachin Tendulkar on Half Marathon In Hyderabad : ఏజేస్​ ఫెడరల్​ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాల ద్వారా నిర్భయ భవిష్యత్తులో ఛాంపియన్​గా చేస్తోందని ఏజియాస్​ ఫెడరల్ లైఫ్​ ఇన్సూరెన్స్ బ్రాండ్​ అంబాసిడర్​ సచిన్​ అన్నారు. ఈ ఏడాది రన్​ ఏజ్​లెస్​.. రన్​ ఫియర్​లెస్​ అనే థీమ్​ అందరిలో అత్యుత్తమ ప్రయత్నాలను అందించడానికి ప్రేరేపిస్తుందని తెలిపారు. ​ ​

'పరుగు విషయానికి వస్తే, చాలా మంది వ్యక్తులు తమను తాము వివిధ సవాళ్లలో ఎదుర్కొంటారన్నారు. కొంతమంది ప్రాక్టీస్ షెడ్యూల్‌లను నిర్వహించడం, కొందరు వారి ఆహారం గురించి.. మరికొందరు వారి ఫిట్‌నెస్ గురించి ఆందోళన చెందుతుంటారు.. కానీ ప్రారంభించడానికి చాలా ఆలస్యం అని ఎప్పుడూ భావించకూడదు. ఈ సంవత్సరం పాల్గొనేవారు వయస్సు గురించిన ఆలోచనలకు అతీతంగా ముందుకు వెళతారని వయస్సు కేవలం సంఖ్యకే పరిమితం చేయరని ఆశిస్తున్నాను. కేవలం యవ్వనంలో కాకుండా.. అ వయస్సులోనైనా ఫిట్​నెస్​ ప్రారంభించవచ్చు. భారతదేశం క్రీడలను ఇష్టపడే దేశం నుంచి క్రీడలను ఆడే దేశంగా మార్చడానికి, మాకు అన్ని వయసుల వారి భాగస్వామ్యం అవసరం'- సచిన్ తెందూల్కర్, క్రికెట్ సూపర్​స్టార్

Half Marathon in Gachibowli : గచ్చిబౌలిలో 'నెబ్ స్పోర్ట్స్' హాఫ్ మారథాన్... ఛీప్​ గెస్ట్​గా పుల్లెల గోపీచంద్

ఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో విఘ్నేష్ షహానే మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రన్నింగ్, ఫిట్‌నెస్ సంస్కృతిని నిర్మించడంలో తమ కంపెనీ ఎప్పుడు ముందుంటుందన్నారు. హైదరాబాద్ హాఫ్ మారథాన్ 2023కి టైటిల్ స్పాన్సర్‌గా తమ సంస్థ ఉండడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ఫిట్‌నెస్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. వయస్సులో చిన్నా పెద్దా అని లేకుండా అందరినీ రన్నింగ్​ చేయాలని ప్రోత్సాహిస్తున్నమన్నారు.

హైదరాబాద్​లో అల్ట్రా హాఫ్ మారథాన్ రన్

‘రన్ ఏజ్‌లెస్, రన్ ఫియర్‌లెస్’ అనే థీమ్​లో స్ఫూర్తికి అనుగుణంగా, 12 మంది అంధులు పాల్గొంటున్నారు, వారికి ఎన్​జీవో గైడ్ రన్నర్స్ ఇండియా సూచనలు ఇస్తుంది. అదనంగా, కార్డియాక్ రిహాబ్ ఫౌండేషన్ నుంచి 120 మంది వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గోనున్నారు.

ఇందులో పాల్గొనే ఔత్సాహికులు 5కే రన్​కు రూ.600, 10కేకు రూ.1000, 21.1కేకు రూ.1250 చెల్లించాలి. అదనంగా 18% జీఎస్టీ ఉంటుంది. గంట ముందు స్టేడియంలో రిపోర్ట్​ చేయాలి.

మైదానంలో సగం మారథాన్ పూర్తి చేసిన వార్నర్

ఉత్సాహంగా వైజాగ్ నేవీ మారథాన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.