Trs party Activists Meeting: తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ కూడా లేవని, కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్, కుటుంబం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి మోదీ.. కేసీఆర్ ప్రభుత్వం మీద విషంకక్కే ప్రయత్నమే తప్ప తెలంగాణకు కావలసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మాట్లాడలేదని ఆరోపించారు.
దేశమంతట విద్య సంస్థలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొండి వైఖరి చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తుంటే, బీజేపీ మాత్రం మతం పేరుతో చిచ్చులు పెట్టే ధోరణిలో ఉందని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తెరాసను నాయకత్వంలోకి తేవడం కోసం కిందిస్థాయి నుంచి ప్రతి కార్యకర్త ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, సీనియర్ నాయకులు, ముఖ్యకార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
"కేంద్ర ప్రభుత్వం దేశమంతట విద్యా సంస్థలను ఇస్తూ తెలంగాణ రాష్ట్రానికి మొండి వైఖరి చూపిస్తోంది. దేశంలో ఎక్కడా.. లేనన్ని సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని కులాలకు, మతాలకు అతీతంగా అభివృద్ధి చేసే దిశగా కేసీఆర్ పనిచేస్తున్నారు. బీజేపీ మాత్రం మతం పేరుతో చిచ్చులు పెట్టే ధోరణిలో ఉంది."- సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి
ఇవీ చదవండి: