హైదరాబాద్ కొవిడ్ పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడం వల్ల సురారం కాలనీ పీహెచ్సీ వద్ద కొవిడ్ కేంద్రాల కోసం ప్రజలు క్యూ కట్టారు. సుమారు 100 మందికి పైగా లైన్లలో వేచి ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల... కేంద్రాల వద్ద ఏర్పాట్లు సరిగ్గా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సెంటర్ల పరిసరాల్లోని గల్లీల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేశారు.
ఇదీ చదవండి: శ్రీరామనవమి రోజున ఏం చేయాలి?