ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ ఈయూ సంఘం సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ధర్నాకు దిగింది. గత మూడు ఏళ్ల నుంచి ఏ ఒక్క సమస్య పరిష్కరించలేదని ఆ సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్, విరమణ చెందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకుండా కార్మికులపైనే పని భారం మోపుతున్నారని మండిపడ్డారు.
రాయితీలను సకాలంలో ఇవ్వకపోవడం, బడ్జెట్లో నిధులు సరిగ్గా కేటాయించకపోవడం తదితర కారణాల వల్లే ఆర్టీసీకి తీవ్ర నష్టం జరిగిందన్నారు. అర్హులైన ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలని.. ఖాళీల కోసం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి : విడ్డూరం: సొంత బస్సునే చోరీ చేసిన యజమాని