Tirumala Bus Tickets: దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. రెండు వైపులా తీసుకుంటే.. టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. తిరుపతి వచ్చాక 72 గంటల పాటు తిరుపతి-తిరుమల టికెట్ చెల్లుబాటవుతుందని వెల్లడించారు. నేటి నుంచే ఈ కొత్త విధానం అమలవుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: