ETV Bharat / state

RS Praveen kumar: 'మీ బంధు- బంధూకుల డ్రామాలకు చరమగీతం పాడతాం' - సీఎం కేసీఆర్​పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఓయూ స్కాలర్ పాల్వాయి నగేశ్​పై జరిగిన దాడిని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళితబంధు’ సభ నిర్వహించారని పేర్కొన్నారు.

praveen
బంధు
author img

By

Published : Aug 16, 2021, 6:52 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్... డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen kumar) ట్విట్టర్ వేదికగా అన్నారు. ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళితబంధు’ సభ నిర్వహించారని పేర్కొన్నారు.

మరోవైపు ఒక బహుజన బిడ్డ ఓయూ స్కాలర్ పాల్వాయి నగేశ్​పై పట్టపగలే అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరులు హత్యాయత్నానికి పాల్పడినట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్ స్పష్టం చేశారు. మీ బంధు-బంధూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.

దాడి...

తుంగతుర్తి ఎమ్మెల్యే రాజీనామా చేయాలంటూ తుంగతుర్తి, నాగం, మోత్కూరు మండల కేంద్రంలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమంలో తనపై దాడి జరిగిందని పాల్వాయి నగేశ్​ ఆరోపించారు. ఈ క్రమంలో నాగరం మండలం పస్తాల వద్దకు రాగానే నగేశ్​పై తెరాస కార్యక్తలు దాడి చేసి కారు అద్దాలు ద్వంసం చేసినట్లు వాపోయారు.

  • ఒక వైపు ప్రజల గొంతు నొక్కి, ప్రజల డబ్బుతో ముఖ్యమంత్రి ‘దళిత బందు’ సభ- మరో వైపు ఒక బహుజన బిడ్డ OU Scholar Palvai Nagesh పై పట్టపగలే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా MLA Tungaturti అనుచరుల హత్యాయత్నం! I strongly condemn this. మీ బందు-బందూకుల డ్రామాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. pic.twitter.com/6GfdpqvYYj

    — Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.