విద్యుత్ బిల్లుల్లో భారీ తేడాలు వస్తున్నాయి. అవి చూసిన వినియోగదారులు షాక్‌కు గురవుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఓ వినియోగదారుడికి 25 లక్షల కరెంట్ బిల్లు రావడంతో షాక్ కొట్టినంత పనైపోయింది. సీతాఫల్ మండిలోని ఈఆర్ఓ పరిధిలో ఉన్న లాలాగూడ సెక్టార్‌లోని యూఎస్సీ నంబర్ 100293954 గల విద్యుత్ మీటర్లో 121 రోజులకు 3,45,007 యూనిట్లు కరెంట్ బిల్లు వాడినట్లు రీడింగ్ చూపెడుతోంది. దీంతో రూ.25,11,467ల బిల్లు వచ్చినట్లు బిల్లు తీసి రీడింగ్ ఆపరేటర్ వినియోగదారుడి చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా వినియోగదారుడు ఖంగుతిన్నాడు.
వెంటనే తేరుకుని ఈ విషయం విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆ మీటర్లో లోపం ఉందని... మీటర్ డిస్ప్లే సరిగ్గా పనిచేయడం లేదని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొన్నారు. వెంటనే మీటర్‌ను మార్చి మరో కొత్త మీటర్‌ను బిగించినట్లు వినియోగదారుడు వివరించాడు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?