కరోనా వైరస్ నియంత్రణ కోసం.. ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే.. సికింద్రాబాద్‌లోని మొండా మార్కెట్, రైల్వే స్టేషన్, ప్యారడైజ్, బేగంపేట్, రహదారులన్నీ బోసిపోయాయి. ప్రజలంతా ఇంట్లోనే సంఘటితంగా ఉండటం మూలంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. జూబ్లీ బస్టాప్‌లో ఉత్తర తెలంగాణాకు వెళ్లే అన్ని బస్సులు నిలిచిపోయాయి.
ఉదయం రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరేందుకు పోలీసులే ఆటోలను సమకూర్చారు. షాపులు, మాల్స్, మెట్రో స్టేషన్లు పూర్తిగా మూతపడడం వల్ల రోడ్లన్నీ వెలవెలబోయాయి. కంటోన్మెంట్ ప్రాంతంలోని రహదారులన్నీ ఖాళీగా కనిపించాయి. జీహెచ్ఎంసీ డిజాస్టర్ విభాగం వారు రాణిగంజ్, బన్సీలాల్ పేట, ప్యాట్నీ, ప్యారడైస్ ప్రాంతాల్లో యాంటీ వైరస్ ద్రావణాన్ని పిచికారి చేశారు.
ఇదీ చదవండి: జనతా కర్ఫ్యూ అంటే ఏమిటి? దాని అవసరం ఏంటి?