అయిదేళ్లలో హైదరాబాద్లోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించింది. ఏడు ప్యాకేజీలుగా రోడ్డు విస్తరణ, నిర్వహణ పనులను ప్రభుత్వం పలు ఏజెన్సీలకు అప్పగించింది. అందంగా తీర్చిదిద్దటంతోపాటు పారిశుద్ధ్యం, మురుగు, వరదనీటి పారుదల నిర్వహణను కూడా చేపట్టాల్సిన బాధ్యత ఏజెన్సీలదే.
నిర్వహణలో భాగంగా మొత్తం 709 కిలోమీటర్లలో మొదటి ఏడాది 50శాతం రోడ్లను రీకార్పెటింగ్ చేయాలి. అంటే ఈ ఏడాది జూన్ వరకు 331 కిలోమీటర్ల పనులు లక్ష్యంగా ఉండగా అందులో ఇప్పటిరకు 208 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకు 300 కి.మీ పనులు చేపట్టే అవకాశముందని సీఆర్‌ఎంపీ చీఫ్ ఇంజినీర్ జియాఉద్దీన్ తెలిపారు. రోడ్లపై గుంతలు పూడ్చడం, మార్కింగ్, ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ మీడియం, రోడ్ సేఫ్టీ, లేన్ మార్కింగ్ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా పని ప్రదేశంలో రక్షణ చర్యలు తీసుకుంటూ, ఎడం పాటించేలా చూస్తున్నారు.