హైదరాబాద్ మియాపూర్‌లోని బొల్లారం కూడలి వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. సందీప్ రెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతిగా మద్యం సేవించి కారును వేగంగా నడిపి ఆటోను ఢీకొట్టాడు.
కేసు నమోదు
ఆటో డ్రైవర్ కృష్ణ అక్కడికక్కడే మృతి చెందగా సందీప్ అనే వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైన సందీప్ రెడ్డి, మధుపై కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి: 'ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనివారు నా గురించి మాట్లాడుతున్నారు'