ETV Bharat / state

విజయారెడ్డి హత్య బాధాకరం... నిందితుడిని కఠినంగా శిక్షించాలి - 'ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలి'

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌సీల్దార్ విజ‌య‌రెడ్డి హ‌త్య‌ను తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్  తీవ్రంగా ఖండించింది. విధి నిర్వ‌హ‌ణ‌లో తోటి ఉద్యోగినిని కోల్పోవ‌టం దిగ్భ్రాంతికి గురి చేస్తోందని సభ్యులు వెల్లడించారు.

revenue-employees-on-abdullapurmet-mro-murdr-issue
author img

By

Published : Nov 4, 2019, 6:44 PM IST

అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి దారుణ హ‌త్యను రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కార్యాయ‌లంలోనే త‌హ‌సీల్దార్‌ను స‌జీవ ద‌హ‌నం చేయ‌డం అత్యంత దారుణ సంఘ‌ట‌న‌గా డిప్యూటీ కలెక్టర్స్ అసోషియయేషన్, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ నేతలు లచ్చిరెడ్డి, ఎస్.రాములు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. విధి నిర్వహ‌ణ‌లో తోటి ఉద్యోగినిని కోల్పోవ‌డం దిగ్భ్రాంతికి గురి చేస్తోందన్నారు. ప్రతీ రెవెన్యూ ఉద్యోగి ఈ సంఘ‌ట‌న‌ను ఖండించాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులు వెంట‌నే విధులు బ‌హిష్కరించి బ‌య‌ట‌కు వ‌చ్చి నిర‌స‌న తెలియ‌జేయాల‌ని పిలుపునిచ్చారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి...

తహసీల్దార్ విజయారెడ్డిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట విధులు బహిష్కరించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సురేష్ ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. తహసీల్దార్ మృతికి రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఇవీచూడండి: అబ్దుల్లాపూర్‌మెట్‌లో విషాదం... తహసీల్దార్ దారుణ హత్య

TG_Hyd_33_04_Tngos On Mro Vijaya Reddy_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌య‌రెడ్డి దారుణ హ‌త్య‌ను టీఎన్జీవో నాయకులు తీవ్రంగా ఖండించారు .కార్యాయ‌లంలోనే త‌హ‌శీల్దార్‌ను స‌జీవ ద‌హ‌నం చేయ‌డం అత్యంత దారుణ సంఘ‌ట‌న‌ అని టీఎన్జీవో హైద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ అన్నారు . హత్యకు కారకులైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం షీ టీమ్స్ ఏర్పాటు చేసి... మహిళలకు రక్షణ కల్పిస్తున్నప్పటికి... మహిళ ఉద్యోగులకు రక్షణ కరువైయ్యిందని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా... ఉద్యోగులకు ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ముజీబ్ పేర్కొన్నారు. బైట్ : ముజీబ్ ( టీఎన్జీవో హైద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు )

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.