ETV Bharat / state

Revanth Reddy To Meet Ponguleti Today : నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్​ రెడ్డి భేటీ - కాంగ్రెస్​లో చేరికలకు జోరు

Revanth Reddy Meeting With Ponguleti Today : బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా పలువురు ముఖ్యనేతలు.. కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2న ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో రాహుల్‌గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణరావును కాంగ్రెస్‌లోకి రావాలని స్వయంగా ఆహ్వానించనున్నారు.

Revanth Reddy To Meet Ponguleti Today
Revanth Reddy To Meet Ponguleti Today
author img

By

Published : Jun 21, 2023, 7:15 AM IST

నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్​ భేటీ

Revanth Reddy To Meet Ponguleti And Jupally Today : మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా ముఖ్యనేతలు జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగసభలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ సభకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు కార్యక్రమం ఖరారైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అంతకుముందే ఈ నాయకులిద్దరూ.. ఈ నెల 25న దిల్లీలో రాహుల్‌గాంధీతో సమావేశమై చర్చించి.. 26న దిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు ప్రకటిస్తారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించనున్నారు. తర్వాత జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్‌గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభ గురించి వారితో చర్చించనున్నారు.

Ponguleti Srinivasa Reddy to Join Congress Party : పొంగులేటి, జూపల్లితో గత మూడు, నాలుగు రోజులుగా బీజేపీ నాయకులు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. జరిపిన చర్చలు కొలిక్కి రాకపోగా.. చివరకు ఎవరిదారి వారిదే అని నిర్ణయించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు మొదట చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీనే గట్టిగా ఎదుర్కోగలదనే అంచనాతో పాటు ఈటల రాజేందర్‌తో వారికున్న స్నేహంతో పలు దఫాలు చర్చలు జరిగాయి. కానీ ఖమ్మం జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదనే అభిప్రాయం అనుచరుల నుంచి వ్యక్తం కావడం, కర్ణాటకలో కాంగ్రెస్‌ విజయం సాధించడం వంటి కారణాలతో పొంగులేటి, జూపల్లి ఊగిసలాటలో పడ్డారు. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్ఎస్​ను ఓడించాలంటే ఆ పార్టీ వ్యతిరేకులంతా ఓ గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించడం లేదా అందరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్లడం తదితర ప్రత్యామ్నాయాలపై ఈ నాయకులంతా కలిసి నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు.

Congress Leader Revanth Reddy To Meet Ponguleti : బీజేపీలో కూడా ఈటలకు, కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన నాయకులకు తగిన ప్రాధాన్యం లభించలేదనే ప్రచారంపైన కూడా చర్చించినట్లు తెలిసింది. ఈటలను ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ వార్తలొచ్చినా చివరకు అది కూడా కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి తదితరులు గత మూడు, నాలుగు రోజులుగా విస్తృతంగా సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. చివరకు ఈటల, రాజగోపాల్‌రెడ్డి.. తాము బీజేపీను వీడేది లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్లుగానే.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జడ్పీ ఛైర్మన్లు కూడా చేరతారనే ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.