Revanth Reddy On Urea Shortage Telangana : రాష్ట్రంలో యూరియా కొరత(Urea Shortage Telangana) లేకుండా చూడాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. యూరియా కొరత లేకుండా చూసేందుకు సీనియర్ అధికారులతు బాధ్యతలు అప్పగించాలి తెలిపారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. రైతులు అడిగినంత యూరియాను అందుబాటులో ఉంచాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడే ఎరువులను వందకు వంద శాతం ఉచితంగా సరఫరా చేస్తామని 2017 ఏప్రిల్ 13న ప్రగతి భవన్ సాక్షిగా సీఎం కేసీఆర్.. రైతులకు ఇచ్చిన మాటకు దిక్కు లేకుండా పోయిందని అన్నారు.
Revanth Reddy On Urea Deficiency Telangana : ఆరు నూరు అవుతుందేమో కానీ కేసీఆర్(Telangana CM KCR) మాట మీద నిలబడడం జరగదని మరోసారి నిరూపితమైందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) లేఖలో ధ్వజమెత్తారు. ఉచిత ఎరువులు అని రైతుల చెవిలో సీఎం పెట్టిన గులాబీ పూలు అలాగే ఉన్నాయని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎరువులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కోఆపరేటివ్ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నారని పేర్కొన్నారు.
Revanth Reddy Letter to CM KCR Over Urea Issues : రాష్ట్రంలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) సొంత జిల్లా, రాష్ట్రంలో సాగుకు కీలకమైన సాగర్ ఆయకట్టు ప్రాంతాలైన సూర్యాపేట, కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రం, నేరేడుచర్ల మండలం కల్లూరు, మేడారం, దాసారం, ఎల్లారం, నాగార్జునసాగర్ పరిధిలోని హాలియా ప్రాంతాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం గోదాంలు, ప్రైవేట్ షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారాయని ఆవేదన చెందారు.
'రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ను అమలు చేయాలి'.. కేసీఆర్‌కు రేవంత్ లేఖ
సూర్యాపేట జిల్లా పాలకీడు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారని రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం సొంత జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలంలోని రైతులు యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని.. వారం రోజుల పాటు తిరిగినా దొరకడం లేదని వాపోతున్నారని బహిరంగ లేఖలో రేవంత్ పేర్కొన్నారు. నిపుణుల సూచనలు పట్టించుకోకుండావారి ఇష్టారాజ్యంగా సాగిస్తున్న పాలన కారణంగా అన్నదాతలు సంక్షోభంలో చిక్కుకున్నారని సీఎంనుద్దేశించి అన్నారు.
Urea Shortage Telangana 2023 : ఇప్పటికైనా ఓట్లు, సీట్లు అంటూ రాజకీయాలు చేయడం మాని రైతులు పడుతున్న గోసను తీర్చేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. తక్షణమే అధికారులను అదేశించి యూరియా సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా రైతులకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత సీఎంపైన ఉందని.. రాష్ట్రంలోని రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉద్యమ కార్యాచరణకు దిగుతుందని హెచ్చరిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌కు రాసిన బహిరంగ లేఖలో తెలిపారు.
Congress Party joinings in Telangana : కాంగ్రెస్లో ప్రముఖ నాయకుల చేరికకు ముహూర్తం ఖరారు