Revanth Reddy: మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని నారాయణపురం నుంచి చౌటుప్పల్ వరకు కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతుండడం, కరోనా లక్షణాలు ఉండటంతో నమానాలను కొవిడ్ నిర్ధారణ పరీక్షకు పంపించారు. కాగా, మరోవైపు మునుగోడు పాదయాత్రకు రేవంత్ రాకూడదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
ఈ మేరకు పాదయాద్రకు వెళ్లకుండా రేవంత్‌ని ఆపాలని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ను కోమటిరెడ్డి డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఏఐసీసీ ప్రతినిధులు బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కోమటిరెడ్డి పట్టు వీడడం లేదని పార్టీ వర్గాల సమాచారం.
ఇవీ చదవండి: తెరాస పాలనలో డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బండి సంజయ్