తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(TPCC) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా మహ్మద్ అజారుద్దీన్, జె. గీతారెడ్డి, ఎం. అంజన్‌కుమార్ యాదవ్, టి. జగ్గారెడ్డి, బి. మహేశ్‌కుమార్ గౌడ్‌లు నియమితులయ్యారు.
ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొదెం వీరయ్య, సురేశ్ షెట్కార్, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్ ముదిరాజ్, గోపిశెట్టి నిరంజన్, టి. కుమార్ రావు, జావేద్ ఆమీర్ నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధుయాస్కీ గౌడ్, కన్వీనర్‌గా సయ్యద్ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.
తనపై నమ్మకంతో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దీనితో తన బాధ్యత మరింత పెరిగిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన అనంతరం మాజీ మంత్రులను రేవంత్ రెడ్డి కలిశారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇంటికి వెళ్లి వారితో భేటీ అయ్యారు.
ఇదీ చూడండి: CM KCR: కలెక్టర్ల అనుమతి లేకుండా కొత్త లేఅవుట్లు అనుమతించవద్దు: సీఎం