Revanth Reddy Fires on CM KCR : బీఆర్ఎస్‌కు ధైర్యం ఉంటే మద్యం, డబ్బు పంచకుండా శాసనసభ ఎన్నికల్లో పోటీకి రావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. విధివిధానాలపైనే ఎన్నికలకు వెళ్దాం.. రండి అంటూ సవాల్ విసిరారు. చుక్క మందు పోయవద్దు.. పైసలు పంచవద్దని.. బీఆర్ఎస్‌కు భారాసకు ధైర్యం ఉంటే తమ సవాళ్లను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Calls KCR a Criminal Politician : దేశంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం ఉందని రేవంత్ అన్నారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారని.. నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రం ఒక్క వ్యక్తి పాదాల కింద నలిగిపోతుందని విమర్శించారు. ఎన్ని రాజకీయ ఇబ్బందులు ఎదురైనా.. సోనియాగాంధీ ధర్మం వైపు నిలబడటం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టడమే లక్ష్యం - ప్రచారంలో తగ్గేదేలే అంటున్న విపక్షాలు
'తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో యువత త్యాగాలు చేశారు. ఈ పదేళ్లలో కేసీఆర్ ఏం చెప్పారు.. ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలి. పేదల సంక్షేమం కోసం నిధులు ఉపయోగపడ్డాయో లేదో ఆలోచించాలి. రాష్ట్ర చిహ్నంలో రాచరిక పోకడలు గుర్తులే కనిపిస్తున్నాయి.. కానీ అందులో ఉండాల్సింది ప్రజల త్యాగాల గుర్తుల.. రాష్ట్రం అధికారిక చిహ్నంలో పోరాటాల స్ఫూర్తి కనిపించడంలేదు. నిరసనలు తెలపడం ప్రజల ప్రాథమిక హక్కు. ప్రజల ప్రాథమిక హక్కులను ఈ పదేళ్లలో కేసీఆర్ కాలరాశారు. ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి ప్రజలే భయపడేలా బీఆర్ఎస్ పాలన ఉంది. సచివాలయంలోకి ప్రజాప్రతినిధులను, మీడియా మిత్రులను రానివ్వడం లేదు. కేసీఆర్.. నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్.' అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎన్నికల సవాళ్లకు పార్టీల వ్యూహాలేంటి?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో మార్పులు చూస్తామన్న యువత ఆకాంక్షలు అడియాశలయ్యాయని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ కుంగిందని.. పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ విఫలమైందని విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన పాత హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారని.. పదేళ్లుగా కేసీఆర్ మోసం చేస్తున్నారని ప్రజలకు అర్థమైందని రేవంత్ రెడ్డి తెలిపారు. బంగారు తెలంగాణ ఫలాలలు ఎవరిక అందుతున్నాయని ప్రశ్నించారు. నిర్దిష్టమైన విధానాలతోనే తాము ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు.
"ధరణి పోర్టల్‌లో సమూల మార్పులు తీసుకువస్తాం. ధరణిలో పెద్ద దళారులు.. కేసీఆర్ కుటుంబసభ్యులే.. మెట్రో విస్తరిస్తామని గతంలోనే మేం హామీ ఇచ్చాం. మెట్రో విషయంలో కేసీఆర్ చెప్పేది ఒకటి.. చేసేది మరొకటి. పాతబస్తీ యువతకు ఉపాధి కల్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగ్ నివేదిక ఇచ్చింది.. మేడిగడ్డ పిల్లర్ మూడు అడుగులు కుంగిపోయింది. అడుగున ఇసుక ఉందని నీటిపారుదలశాఖ ఇంజినీర్లకు తెలియదా? నీటిపారుదల శాఖను మొదట్నుంచీ హరీశ్‌రావు, కేసీఆరే చూస్తున్నారు. కొడంగల్, తాండూరులో పండే కందిపప్పును నేను.. కేటీఆర్.. గన్నేరు పప్పు లాంటివాడు.. తింటే ప్రాణాలకే ప్రమాదం." - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
Revanth Reddy On Congress Welfare Schemes : సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని రేవంత్ అన్నారు. పింఛన్లు, పక్కా ఇళ్లు, నిరుపేదలకు భూమి ఇచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మైనార్టీలను ఓట్లు వేసే యంత్రాలుగా మా పార్టీ చూడదని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో మైనార్టీలను భాగస్వాములుగా మారుస్తామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోనే.. ఇప్పుడు కేసీఆర్ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రైతు ఖాతాలో రూ.10 వేలు వేస్తామని తాము 2014లో తాము హామీ ఇచ్చామన్న రేవంత్.. దళారుల చేతుల్లో రైతులు మోసపోకూడదనే కనీస మద్దతు ధర ప్రకటించామని వెల్లడించారు.
ఖమ్మం రాజకీయం రసవత్తరం ప్రచారపర్వంలో పార్టీల దూకుడు
'హైదరాబాద్ అభివృద్ధికి మూలం.. కాంగ్రెస్ విధానాలే. మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం.. ఇరువైపులా వ్యాపార కేంద్రాలు నిర్మిస్తాం. మూసీని ప్రపంచస్థాయి అందమైన నదిగా మారుస్తాం. 2050 నాటికి ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్‌ను మార్చే ప్రణాళిక మా వద్ద ఉంది. రాచకొండ గుట్టలను ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారుస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి మా వద్ద మెగా మాస్టర్ ప్లాన్ ఉంది. ప్రజల సలహాలు, సూచనలు తీసుకుని హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తాం. కమ్యూనిస్టు పార్టీలు మా పార్టీకి సహజ మిత్రులు. సీపీఐ, సీపీఎం నేతలతో మా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. కమ్యూనిస్టులతో పొత్తుపై మా అధిష్ఠానం, కమిటీ ఇంకా చర్చిస్తోంది.' అని రేవంత్ రెడ్డి అన్నారు.
శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం