ETV Bharat / state

Revanth Reddy on KCR: కేసీఆర్.. రైతులపై నిజంగా ప్రేముంటే దిల్లీలో దీక్ష చేయ్..: రేవంత్​రెడ్డి

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy on KCR) హెచ్చరించారు. గతంలో కేసీఆర్​ ఇచ్చిన హామీ మేరకు.. ప్రతి గింజా(Paddy procurement issue in telangana) రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని(Revanth Reddy on KCR) డిమాండ్​ చేశారు. గాంధీ భవన్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్​కు రైతులపై నిజంగా ప్రేముంటే దిల్లీలో దీక్ష చేయాలని సూచించారు.

Revanth Reddy on KCR
రేవంత్​ రెడ్డి
author img

By

Published : Nov 14, 2021, 12:52 PM IST

Updated : Nov 14, 2021, 7:12 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి(Revanth Reddy on KCR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం(Paddy procurement issue in telangana) కొనుగోళ్ల విషయంలో ఇరు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. కొనుగోళ్ల సమస్యకు పరిష్కారం చూపడం లేదని(Revanth Reddy on KCR) ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ భవన్​లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్​ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ధాన్యం కుప్పలపై రైతులు ప్రాణాలు విడిచే పరిస్థితి నెలకొందని రేవంత్​(Revanth Reddy on KCR) ఆవేదన చెందారు. ప్రతిదీ రైతులు గమనిస్తున్నారని అన్నారు.

భాజపా, తెరాసలది ఓ నాటకం: రేవంత్ రెడ్డి

ఎందుకు ఓటేయాలి.?

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు విధివిధానాలు రూపొందించలేదు. గతంలో ప్రతి గింజా కొంటానని చెప్పిన కేసీఆర్​.. ఇప్పుడు కొననని చెబితే ఊరుకునేది లేదు. ధనిక రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేయలేదా.?. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా చివరి గింజ వరకూ కొనేలా చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. అవగాహనతో కూడిన నాటకం ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్​.. దిల్లీ జంతర్​మంతర్​లో దీక్ష చేపట్టాలి. ధాన్యం కొనని పార్టీలకు ఎందుకు ఓటు వేయాలి .? -రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

అవగాహనతో కూడిన డ్రామా

ప్రతి గింజా కొంటానని సీఎం కేసీఆర్ చెప్పారని.​. ఇప్పుడు కొననని చెబితే ఊరుకునేది లేదని రేవంత్​ రెడ్డి(Revanth Reddy on KCR) హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో నిజంగా కొట్లాడాలి అనుకుంటే దిల్లీలో దీక్ష చేపట్టాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. ఇదంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహనతో కూడుకున్న హై డ్రామా నడుస్తుందని వ్యాఖ్యానించారు. రైతుల వద్ద నుంచి చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనాలని డిమాండ్​ చేశారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందేనని డిమాండ్​ చేశారు. ధాన్యం కొనని పార్టీలకు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పదేళ్లు జైలు జీవితం గడిపిన భారత ప్రథమ ప్రధాని స్వర్గీయ జవహర్‌లాల్‌ నెహ్రూ చరిత్రను నేటి యువతకు తప్పుగా చూపిస్తున్నారు. కొంతమంది చరిత్రను వక్రీకరిస్తూ... దేశం కోసం త్యాగం చేసిన మహా నేతలను అవమానపరిచే విధంగా ప్రవరిస్తున్నారు. --రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

నిబంధనలు మాకేనా..

ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ప్రజాచైతన్య యాత్రను రద్దు చేయలేదని.. వాయిదా వేశామని రేవంత్​(Revanth Reddy on KCR) స్పష్టం చేశారు. తెరాస ధర్నాలకు అనుమతులిచ్చిన పోలీసులు కాంగ్రెస్‌కు ఇవ్వట్లేదని మండిపడ్డారు. నిబంధనలు కాంగ్రెస్‌కేనా, తెరాస, భాజపాకు వర్తించవా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కలెక్టర్లు రాజకీయ నేతల అవతారం ఎత్తారని ఎద్దేవా చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన తెలుపుతామని వెల్లడించారు.

ఇదీ చదవండి: D Srinivas: రాజకీయ ఉద్ధండుడు డీఎస్ దారెటు.. పెద్దాయనవైపా.. చిన్నాయనవైపా?

Last Updated : Nov 14, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.