నైరుతి రుతుపవనాలు తెలంగాణకు ఈనెల 19 లేదా 20 తేదీల్లో వచ్చే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలోని వాయు తుపాను వల్లనే రుతుపవనాల కదలికలు కొద్ది రోజులుగా నిలిచిపోయాయని... శుక్రవారం అవి ముందుకు కదిలినట్లు వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఎంత వేగంగా విస్తరిస్తాయనే దానిని బట్టి రాష్ట్రానికి ఎప్పుడు వచ్చేది 2,3 రోజుల్లో స్పష్టంగా తెలుస్తుందని ఆయన వివరించారు. ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు. వర్షాలు కురవని ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని తెలిపారు.
ఇవీ చూడండి : నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలే: ఖమ్మం ఎమ్మెల్యే