సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పురలో నివాసం ఉంటున్న రిటైర్డ్ పోలీస్ అధికారి రత్నగిరి ఆదివారం సాయంత్రం తీవ్ర అనారోగ్యంతో మరణించారు. జంట నగరాలలోని అనేక పోలీస్ స్టేషన్లలో కీలక పదవులు అలంకరించి చివరికి సీబీసీఐడీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్‌గా 2004లో పదవీ విరమణ పొందారు.
హైదరాబాద్‌లో 1945లో జన్మించిన రత్నగిరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత నేరుగా సబ్ ఇన్స్పెక్టర్గా పోలీసు శాఖలో చేరారు. అప్పటి నుంచే జంట నగరాలలో గల అనేక స్టేషన్లలలో ఎస్ఐ, సీఐగా విధులు నిర్వహిస్తూ రాజకీయ పార్టీలు, నాయకులకు వత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా విధులు నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో సీఐగా ఉన్న ఆయన స్టేషన్లో లేని సమయంలో లాకప్ డెత్ జరిగింది. అప్పట్లో ఆంధ్ర ప్రదేశ్ సంయుక్త రాష్ట్రాలలో పెద్ద సంచలనం చెలరేగిన ఘటన అది, ఆ తర్వాత 1995లో డీఎస్సీగా రత్నగిరిని నిజామాబాద్‌కు బదిలీ చేశారు.
నక్సలైట్ల ఏరివేత భాగంలో అక్కడికి పంపినా.. ధైర్యంగా విధులు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. అంతలోనే ఏసీపీగా తిరిగి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. అప్పటి నుంచి వెనుతిరగకుండా తన విధులు విజయవంతంగా నిర్వహించి, పోలీసు శాఖలో మంచి గుర్తింపు తెచ్చుకుని.. నీతి నిజాయితీ గల పోలీస్ అధికారిగా ఎన్నో అవార్డులు పొందారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు