ETV Bharat / state

జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు

కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తుండటం వల్ల జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై బల్దియా పాక్షిక ఆంక్షలు విధిస్తోంది. కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరుతోంది.

Restrictions in ghmc office
ghmc corona cases
author img

By

Published : Mar 26, 2021, 8:28 PM IST

హైదరాబాద్ నగరంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసుల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి వచ్చే సందర్శకులపై బల్దియా పాక్షిక ఆంక్షలు విధించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కార్యాలయానికి ఉదయం నుంచే కార్యాలయ వేళల్లో పెద్ద ఎత్తున వివిధ పనుల నిమిత్తం వస్తున్నారని.. రాష్ట్రంతో పాటు నగరంలో పెద్దఎత్తున కొత్త కేసులు నమోదవుతున్నందున కార్యాలయానికి వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధిస్తున్నట్టు గ్రేటర్ అధికారులు స్పష్టం చేశారు.

ప్రజాశ్రేయస్సు కోసం ఆంక్షలు...

ఇప్పటికే జీహెచ్ఎంసీలోని పలు విభాగాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు, సిబ్బంది, సాధారణ ప్రజానికం శ్రేయస్సు కోసం ఆంక్షలు ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది కూడా కచ్చితంగా కొవిడ్ నియమ నిబంధనలు పాటించాలని, భౌతిక దూరం, మాస్క్​లను ధరించడం, హ్యాండ్ వాష్ విధిగా చేసుకోవాలని సూచించారు.

కొవిడ్ నిబంధనలు తప్పనిసరి...

జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చే సందర్శకులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లపై కూడా ఈ ఆంక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. తమ ఆరోగ్య భద్రతా దృష్ట్యా కార్యాలయానికి రావద్దని సూచించారు. ఏదైనా ఫిర్యాదులు, విజ్ఞాపనలు ఉంటే మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా చేయాలని, లేదా సందర్శన సమయంలో కార్యాలయ భవనం ప్రవేశద్వారం వద్ద ఉన్న గ్రీవెన్స్ సెల్​లో దరఖాస్తులు అందచేయాలని పేర్కొన్నారు.

కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నందున కార్యాలయంలోని అధికారులు, సెక్షన్లలో సిబ్బందిని సాధ్యమైనంత మేర కలవవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇవీచూడండి: నీటి కేటాయింపుల్లో రాజీపడే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.