Restrictions on Diwali Crackers in Hyderabad : నగరంలో దీపావళి పండుగ సందర్బంగా హైదరాబాద్ పోలీసులు బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు విధించారు. ఈ నెల 12 నుంచి 15 వరకు నిబంధనలు అమలులో ఉంటాయని సీపీ సందీప్ శాండిల్యా ఉత్తుర్వులు జారీ చేశారు. అధిక శబ్ధం చేసే టపాసులను రాత్రి 8 నుంచి 10 గంటల సమయంలో కాల్చాలని ఆయన ఆదేశాల్లో పేర్కొన్నారు. జనసంద్రం ఉండే ప్రాంతాల్లో టపాసులను కాల్చకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా సమయాల్లో పరిమితికి మించి శబ్దం వచ్చే టపాసులు కాల్చొద్దని పోలీసులు సూచించారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్- ఉద్యోగులకు యజమాని సర్ప్రైజ్
Rajasingh Reacts on Crackers Restrictions : మరోవైపు దీపావళి పండుగ సందర్భంగా.. బాణాసంచా దుకాణాలపై ఆంక్షలు సరికాదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja singh) పేర్కొన్నారు. టపాసుల దుకాణాలను రాత్రి ఒంటి గంట వరకు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత పది రోజుల నుంచి గోషామహల్ నియోజకవర్గంలో బాణసంచా దుకాణాల యజమానులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
దీపావళి స్పెషల్ గ్రీటింగ్స్ - మీ ఆత్మీయులకు ఇలా శుభాకాంక్షలు చెప్పండి!
అప్పులు చేసి మరీ దీపావళి సందర్భంగా దుకాణాలు పెట్టారని, పోలిసుల ఆంక్షల వల్ల బాణాసంచా దుకాణాల యజమానులు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. నగరంలో తాము ఎలాంటి నిబంధనలు పెట్టలేదని సీఈఓ చెప్పారని రాజాసింగ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఒంటి గంట వరకు టపాసుల దుకాణాలకు అనుమతి ఇవ్వాలన్న విషయంపై.. ఈసీ, పోలిస్ కమిషనర్ సానుకూలంగా స్పందించారన్నారు.
Diwali celebrations in Telangana : వెలుగుల పండగ దీపావళికి రెండు రోజులు మాత్రమే ఉండటంతో నగరవాసులు దీపపు ప్రమిదలు, క్రాకర్స్ కొనుగోలుతో మార్కెట్లన్నీ సందడిగా మారాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే దీపావళి పండుగను.. ప్రజలు పేద, ధనిక అనే తేడా లేకుండా ఇళ్లలో దీపాలతో అలంకరించేందుకు ప్రమిదలు కొంటున్నారు. ప్రత్యేకమైన రంగురంగుల డిజైన్ గల ప్రమిదలు షాపుల్లో విక్రయిస్తున్నారు.
ఒకప్పుడు మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించేవారు.. కానీ ప్రస్తుతం మట్టి ప్రమిదలకు కృత్రిమ రంగులను అద్ది అందంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. అలాగే స్విచ్ వేస్తే వెలిగేలా ఎలక్ట్రిక్ దివ్వెలను సైతం అమ్ముతున్నారు. నగరంలోని పలు చోట్లు ఫుట్‌పాత్‌లపై ఎక్కడ చూసినా దీపపు ప్రమిదలు, బొమ్మల కొలువు కోసం వాడే బొమ్మలు, ఇతర పండగ సామాగ్రి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.