దక్షిణ భారత దేశంలో సుప్రీంకోర్టు బెంచి ఏర్పాటుకు ప్రయత్నం ముమ్మరం చేయాలని బార్ కౌన్సిళ్లు (Bar Councils) తీర్మానించాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని ఎంపీలందరి లేఖలను తీసుకోవాలని నిర్ణయించాయి. వచ్చే నెలలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను కలిసి వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించాయి.
తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నర్సింహారెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల బార్ కౌన్సిల్ (Bar Councils) ఛైర్మన్లు ఘంటా రామారావు, ఎల్. శ్రీనివాస్ బాబు, జోసెఫ్ జాన్, పీఎస్ అమత్ రాజ్ పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ బార్ కౌన్సిల్ ప్రతినిధులు కలిసి ఈ అంశంపై ప్రాథమికంగా చర్చించి సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: Ts Lockdown: రాష్ట్రంలో లాక్డౌన్ ఇక ఉండదా? అయితే వాట్ నెక్స్ట్