హైదరాబాద్ కోఠిలోని ఎస్బీఐ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వేడుకలకు బ్యాంకు ఉద్యోగులు కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.
కార్యక్రమానికి హాజరైన చీఫ్ జనరల్ మేనేజర్ ఓపీ మిశ్రా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కొవిడ్ సమయంలోనూ సేవలందించిన ఉద్యోగులను మిశ్రా అభినందించారు. ఎస్బీఐ ఖాతాదారులందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: ఈ చిన్నారుల గణతంత్ర వేడుకలు.. ఎందరికో ఆదర్శం