ETV Bharat / state

ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ పర్యటన

author img

By

Published : Jun 14, 2021, 3:33 PM IST

ముషీరాబాద్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ముంపు ప్రాంతాల్లో జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పర్యటించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో.. ముంపు ప్రాంతాల పరిరక్షణకోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.

Muse catchment areas
Muse catchment areas

హైదరాబాద్ నగరాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ మేయర్ శ్రీలత తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని మూసీ పరివాహక ముంపు ప్రాంతాల్లో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె పర్యటించారు. సీఎం కేసీఆర్ చొరవతో.. ముంపు ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు.

ఆయా ప్రాంతాల ప్రజలు.. ప్రజాప్రతినిధులకు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. వానాకాలంలో తమ ఇళ్లల్లోకి వరద నీటితో పాటు పాములు, క్రిమికీటకాలు వస్తుంటాయని వాపోయారు. సమస్యలపై స్పందించిన డిప్యూటీ మేయర్.. ఈ సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

నిఘా కెమెరాలు..

నాలాలో చెత్త వేసే వారి పట్ల జీహెచ్ఎంసీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని శ్రీలత తెలిపారు. కెమెరాల ద్వారా చెత్త వేసే వారిని పసిగట్టి.. వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కార్పోరేటర్లంతా ప్రతి రోజు రెండు గంటలపాటు కాలనీల్లో పర్యటించి ప్రజలకు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి: etela rajender: జె.పి.నడ్డాను కలిసిన ఈటల రాజేందర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.