ETV Bharat / state

వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు - flood affected areas in hyderabad

కుంభవృష్టితో అతలాకుతలమైన హైదరాబాద్‌లో... సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. మళ్లీ భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో... జీహెచ్‌ఎంసీ, పోలీసుశాఖలు సన్నద్ధంగా ఉన్నామని చెబుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలతో పాటు, వరద తగ్గిన ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు వేగంగా కొనసాగిస్తున్నారు.

relief-efforts-in-the-wake-of-the-floods-in-hyderabad
వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు
author img

By

Published : Oct 20, 2020, 9:55 PM IST

వరదల నేపథ్యంలో ముమ్మరంగా సహాయక చర్యలు

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ముమ్మర సహాయక చర్యలు చేపడుతోంది. భారీవర్షాలు ముంచెత్తనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం 40 బోట్లను సిద్ధం చేసింది. ఏపీ, తెలంగా రాష్ట్రాలకు చెందిన 40 బోట్లు రవీంద్రభారతికి చేరుకున్నాయి. ఏపీ నుంచి 30మంది సభ్యుల విపత్తు నిర్వహణ బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ప్రమాదకరంగా ఉన్న చెరువుల ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్‌ చెరువు తూము లీకేజీ అవుతుండటం వల్ల అధికారులు పరిస్థితిని సమీక్షించారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నిపుణుల బృందాన్ని పిలిపించి పరిస్థితిని వివరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం సహా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందిగానే ఉన్నా.. సమయానికి కనీసం భోజనమైనా అందుతోందని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

వరద తగ్గిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను జీహెచ్‌ఎంసీ వేగంగా కొనసాగిస్తోంది. చెత్తా, చెదారం తొలగిస్తూ కాలనీలను మునుపటిలా మార్చేందుకు పురపాలక సిబ్బంది శ్రమిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆయిల్‌ బాల్స్‌ వేయడం, శానిటైజేషన్‌ కార్యక్రమాలను.. ఎంటమాలజీ విభాగం చేపడుతోంది. ప్రజలు కాచి, వడబోసిన నీటిని మాత్రమే తాగాలని... అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ఎంటమాలజీ అధికారులు సూచిస్తున్నారు.

ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపు

వరద బాధితులకు సాయమందించేందుకు ప్రైవేటు సంస్థలు, ఎన్జీవోలు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్ హార్స్‌ రైడింగ్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో టోలిచౌకిలోని ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో బంజారా మహిళల ఎన్జీవో ఆధ్వర్యంలో.. నిత్యావసర సరుకులు అందించారు.

ఇవీ చూడండి: ఏ క్షణంలోనైనా రంగంలోకి దిగేందుకు ఆర్మీ బలగాలు సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.