Regularization of lands: రాష్ట్రంలో అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. హక్కులు లేని లక్షల ఇళ్ల స్థలాలకు పట్టాలు పంపిణీ చేసే కార్యచరణకు నడుం బిగించింది. స్థలాల క్రమబద్ధీకరణ చేసేందుకు భాగంగా హక్కులు లేని ఇంటి స్థలాలకు ప్రభుత్వం హక్కు పత్రాలు అందించబోతుంది. ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, ఆక్రమిత ప్రభుత్వ స్థలాలు, నోటరీ ఒప్పందాలతో కొనుగోలు చేసినవి, ఇనాం భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ లాంటి ప్రభుత్వ రకానికి సంబంధించిన భూముల్లో వెలసిన ఇళ్లకు హక్కులు కల్పించనుంది. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి జీవో నంబర్ 58,59 కింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కాగా మిగిలిన స్థలాల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు సమాచారం.
స్థలాల క్రమబద్ధీకరణ ద్వారా దరఖాస్తు చేసుకున్నవారికి శాశ్వత హక్కులు కల్పించాలనేది ప్రభుత్వం భావిస్తోంది. ఆక్రమించిన సర్కారి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారికి ఒక దఫా 2014-2016 సంవత్సరాల మధ్య ప్రభుత్వం పట్టాలు అందజేసింది. తర్వాత దాని గడువు తేదినీ 2020 జూన్ రెండు నాటికి పొడిగించింది. ప్రస్తుతం రెండో దఫా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నడస్తున్న దఫాలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇంకా మరో లక్ష వరకు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో 125చ.గజాల లోపు ఉన్న స్థలాలన్ని జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించనున్నారు. 125చ.గజాల పై విస్తీర్ణం ఉన్న స్థలాలను జీవో 59 కింద క్రమబద్ధీకరిస్తారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల వారి నుంచి దరఖాస్తులను స్వీకరించి అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు.
జంట నగరాల్లో అనేక ఒప్పందాలు: హైదరాబాద్-సికింద్రాబాద్ నగరాల పరిధిలో నోటరి ఒప్పందాలతో కొనుగోలు చేసిన భూములు చాలానే ఉన్నాయి. ఈ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి యాజమాన్య హక్కు పత్రాల్లేవు. ఆరు లక్షల వరకు నోటరీ స్థలాలు ఉంటాయని గుర్తించారు. ఎంతోమంది చేతుసు మారిన ఈ స్థలాలపై యాజమాన్య హక్కులను నిర్ధారించడం వల్ల శాశ్వత హక్కులు కలుగనున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో భూములు గ్రామకంఠం స్థలాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో విలీనం అయిన గ్రామాల పరిధిలో ఉన్న గ్రామకంఠం స్థలాలకు హక్కులు కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేరు ప్రభుత్వాన్న కోరారు. సుమారు రెండు లక్షల నివాసాలు గ్రాన కంఠం పరిధిలో ఉండవచ్చని అంచన వేస్తున్నారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠం భూములున్నప్పటికి పుకపాలికల పరిధిలో ఉన్న స్థలాలకు శాశ్వత హక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
గతంలో వారికి దస్త్రాలు: ఉమ్మడి రాష్ట్రంలో పలు దఫాలుగా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు స్థలాలు ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. ఇది వరకు పంపిణీ చేసిన స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి. అనే ప్రాథమిక సమాచారాన్ని రెవెన్యూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి ప్రభుత్వం సేకరించింది. పేదలకు స్థలాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూములు, వాటి ప్రస్తుత పరిస్థితి, ఎసైన్డ్ స్థలాల వివరాలను కూడా అందజేయాలని ప్రభుత్వం జిల్లాల యంత్రాంగాన్ని కోరింది.కాకపోతే గతంలో పంపిణీ చేసిన స్థలాలకు మళ్లీ కొత్త పట్టాలు జారీ చేస్తారా అన్నదానిపై చర్చ జరుగుతోంది.
నెలాఖరు వరకు పొడగింపు: ఆక్రమించిన ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం ఈ నెల 31వ తేది వరకు పొడగించింది. దీనికి సంబంధించి రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎలాంటి అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాలు, అర్బన్ సీలింగ్ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వత హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. గతనెలాఖరులో గడువు ముగియగా మరోమారు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించిన మేరకు రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి: